Karnataka Shocker: వీడు తండ్రేనా.. భార్య ప్రియుడితో వెళ్లిందని కూతుళ్లను చంపేసిన కసాయి, మృతదేహాలను ఆటోలో సీటు కింద పెట్టి బాడుగకు తిప్పాడు, కర్ణాటకలో దారుణ ఘటన

భార్య తన ప్రియుడితో లేచిపోయిందనే కక్షతో ఓ భర్త ఇన ఇద్దరి కుమార్తెలను(Man Kills His 2 Daughters) చంపేశాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Representational Picture. Credits: PTI

Kalaburagi, June 30: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య తన ప్రియుడితో లేచిపోయిందనే కక్షతో ఓ భర్త ఇన ఇద్దరి కుమార్తెలను(Man Kills His 2 Daughters) చంపేశాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన కలబురగిలోని వెదురు బజార్‌లోని భోవి గల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోవి గల్లిలో నివాసముంటున్న లక్ష్మీకాంత (34) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య అంజలి నలుగురు పిల్లలు ఉన్నారు.

అయితే భార్య అంజలి నాలుగు నెలల క్రితం అతన్ని వదిలేసి తన లవర్ తో (Wife Elopes With Paramour in Kalaburagi) వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన భర్త మద్యానికి కూడా అలవాటు పడ్డాడు. పిల్లలను వారి అమ్మమ్మ వద్ద వదిలేసి అతను తాగుడుకు అలవాటుపడ్డాడు. ఈ నేపథ్యంలోనే లక్ష్మీకాంత తన పిల్లలను కలవడానికి వెళ్లి వారిలో ఇద్దరిని MB నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్క్‌కు తీసుకెళ్లాడు.అక్కడే తన ఆటోలో ఇద్దరిని కొట్టి చంపేశాడు. అనంతరం మృతదేహాలను తన ఆటోలనే వెనుక సీటు కింద ఉంచాడు.

ఉడుత వల్లే ఈ ఘోర ప్రమాదం, ప్రమాద ఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించనట్టు తెలిపిన ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ, మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు సహాయం

తమ సీటు కింద రెండు మృతదేహాలున్నట్లు తెలియక చాలా మంది ఆయన ఆటోలో ప్రయాణించారని పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం వరకు నగరమంతా తిరుగుతూ చివరకు పోలీసులకు చిక్కాడు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif