Karnataka Shocker: బెంగుళూరులో దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని వివాహితపై యాసిడ్ పోసిన యువకుడు, కంటికి తీవ్ర గాయం
పెళ్లికి నిరాకరించిన ముగ్గురు పిల్లల తల్లిపై ఒక వ్యక్తి యాసిడ్ (Man Throws Acid On Colleague) పోశాడు. ఈ ఘటనలో ఆమె కంటికి తీవ్ర గాయమైంది. ఆ మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Bengaluru, June 10: కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన (Karnataka Shocker) చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిన ముగ్గురు పిల్లల తల్లిపై ఒక వ్యక్తి యాసిడ్ (Man Throws Acid On Colleague) పోశాడు. ఈ ఘటనలో ఆమె కంటికి తీవ్ర గాయమైంది. ఆ మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త నుంచి విడాకులు పొందిన ఆమె, స్థానిక అగరబత్తి ఫ్యాక్టరీలో పని చేస్తున్నది. కాగా, అదే ఫ్యాక్టరీలో పని చేసే 36 ఏళ్ల అహ్మద్ అనే వ్యక్తితో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. మూడేళ్లగా వారిద్దరూ కలిసి అక్కడే పని చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని కొన్ని వారాలుగా అహ్మద్ ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ఆ మహిళ ( She Turns Down Proposal) నిరాకరించింది.దీంతో కక్ష పెంచుకున్న అతడు శుక్రవారం ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఆ మహిళ కుడి కంటికి గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీరిద్దరూ దాదాపు మూడేళ్లుగా ఒకరికొకరు తెలుసని, అగరుబత్తీలు తయారు చేసే ఫ్యాక్టరీలో కలిసి పనిచేసేవారని పోలీసులు తెలిపారు. రెండు నెలల క్రితం బెంగళూరులో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని తమిళనాడులోని ఒక ఆశ్రమం నుండి అరెస్టు చేశారు, అక్కడ అతను దర్శనీయ వేషంలో నివసిస్తున్నాడు.