Karnataka Shocker: స్కూలుకు వెళ్లి తిరిగివస్తున్న బాలికపై తెగబడిన కామాంధులు, కారులో ఎక్కించుకుని గ్యాంగ్ రేప్, కర్ణాటకలో దారుణ ఘటన
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో గల బంత్వాల్ తాలూకాలోని అంటాడీ (Amtady village) గ్రామంలో ఐదుగురు వ్యక్తులు బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టారు.
Mangalore, Oct 12: కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో స్కూలుకు వెళ్లి తిరిగివస్తున్న మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి (Minor girl allegedly gang-raped) ఘటన కలకలం రేపింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో గల బంత్వాల్ తాలూకాలోని అంటాడీ (Amtady village) గ్రామంలో ఐదుగురు వ్యక్తులు బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టారు.
బాధిత బాలిక శుక్రవారం స్కూల్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా పరిచయమున్న వ్యక్తి తన కారులో ఆమెను ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి మరికొందరితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బాలికను బ్రహ్మరకుట్లు ప్రాంతంలో దించేసి పరారయ్యారు. బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తెలిసిన వ్యక్తి బాధితురాలిని తన కారులో ఎక్కించుకున్న తర్వాత ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
బాధితురాలిని మంగళూరులోని ప్రభుత్వ లేడీ గోస్చెన్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు దుండగులను గుర్తించడానికి పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని ఉపయోగిస్తున్నారు. బంట్‌వాల్ పట్టణ పోలీసులు (Bantwal town police) ఇండియన్ పీనల్ కోడ్ (IPC) కింద మరియు POCSO చట్టంలోని సంబంధిత నిబంధనల కింద గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు.