Bengaluru Shocker: ఇద్దరూ సాప్ట్‌వేర్లు, పిల్లలు కలగలేదని భార్య ఆత్మహత్య, చనిపోయే ముందు భర్త వేధింపులే కారణమని సూసైడ్ లేఖ, బెంగుళూరులో విషాద ఘటన
వేధింపుల భర్తతో విరక్తి చెందిన ఓ భార్య అపార్ట్‌మెంటు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య ( Bengaluru woman ends life) చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్నాటక రాజధాని బెంగళూరు మహాదేవపురలో వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Bengaluru, Oct 21: బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. వేధింపుల భర్తతో విరక్తి చెందిన ఓ భార్య అపార్ట్‌మెంటు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య ( Bengaluru woman ends life) చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్నాటక రాజధాని బెంగళూరు మహాదేవపురలో వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాసన(30), ఆమె భర్త రంజన్ రావత్ దంపతులు ఉత్తరాది నుంచి వలస వచ్చారు.
దిశా అపార్ట్‌మెంటులో 9వ అంతస్తులో అద్దె ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి 9 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వేర్వేరు ఐటీ కంపెనీల్లో టెక్కీలుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి సంతానం కలగకపోవడంతో ఆ విషయమై తరచూ గొడవ పడేవారు. చివరికి విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు తెలిసింది.
తన జీవితం ఏమాత్రం బాగాలేదని విరక్తి చెందిన ఉపాసనా రావత్.. డెత్‌నోట్ రాసి బుధవారం సాయంత్రం తన ఫ్లాటు వరండా నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూసింది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి భర్త రంజన్ రావత్‌ను అరెస్టు చేశారు.
ఆమె ఆరు లైన్లలో ఆంగ్లంలో క్లుప్తంగా రాసిన డెత్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నా భర్త నన్ను మానసికంగా, భౌతికంగా (Unable to bear husband’s harassment) వేధిస్తున్నాడు. అందుకనే నేను చనిపోతున్నా. లైంగికంగా అతడు నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అతన్ని కఠినంగా శిక్షించాలి అని లేఖలో రాసి ఉంది.