Karnataka Shocker: పరాయి వాడితో అక్రమ సంబంధం, తన సుఖానికి అడ్డుగా ఉందని అతని భార్యను, నలుగురు పిల్లలను చంపిన కసాయి మహిళ, కర్ణాటకలో దారుణ ఘటన

ఆదివారం తెల్లవారుజామున మాండ్యా జిల్లాలోని (Mandya district) కృష్ణ రాజ సాగర్ (కెఆర్‌ఎస్) ప్రాంతంలో నలుగురు పిల్లలను (4 children) 30 ఏళ్ల మహిళను హత్య చేసిన ఆరోపణలపై 32 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు (Woman arrested for killing ‘lover’s’ wife) కర్ణాటక పోలీసులు బుధవారం తెలిపారు.

Representational Image | (Photo Credits: IANS)

Mandya, Feb 10: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున మాండ్యా జిల్లాలోని (Mandya district) కృష్ణ రాజ సాగర్ (కెఆర్‌ఎస్) ప్రాంతంలో నలుగురు పిల్లలను (4 children) 30 ఏళ్ల మహిళను హత్య చేసిన ఆరోపణలపై 32 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు (Woman arrested for killing ‘lover’s’ wife) కర్ణాటక పోలీసులు బుధవారం తెలిపారు. మైసూరు తాలూకా బెలవెత్త గ్రామానికి చెందిన సునీల్‌ భార్య లక్ష్మిని నిందితురాలిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. జిల్లా ఎస్పీ ఎన్‌.యతీశ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన మహిళ, మైసూరు నివాసి అయిన లక్ష్మి, హత్యకు గురైన మహిళ యొక్క బంధువు, మరణించిన ఆమే పేరు కూడా లక్ష్మి. ఈమెకు గంగారామ్‌ భర్త అలాగే ముగ్గురు పిల్లలు రాజ్‌ (10), కోమల్‌ (8), కునాల్‌ (6) ఉన్నారు. అయితే నిందితురాలు లక్ష్మికి మృతురాలి భర్త గంగారామ్‌ అంటే ఇష్టం. వారి మధ్య కొన్నాళ్లుగా సంబంధం కూడా నడుస్తోంది. అతను ఓ ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారి. వివాహం చేసుకోవాలని చాలాసార్లు గంగారామ్ ని కోరినప్పటికీ అతను ఒప్పుకోలేదు. ఆమెకు కూడా వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. గంగారాం భార్య కూడా ఆమెను దూరంగా ఉండమని హెచ్చరించింది.

ఇంటి ఓనర్ భార్యతో అక్రమ సంబంధం, ఊరి నుంచి తిరిగివచ్చాక సహకరించలేదని చంపేశాడు, పరారీలో నిందితుడు, పుణేలో షాకింగ్ ఘటన

ఈ నేపథ్యంలోనే మృతురాలు లక్ష్మిని గంగారామ్‌ నుంచి దూరం చేసేందుకు వారి మధ్య గొడవలు సృష్టించేందుకు నిందితురాలు ప్రయత్నించి విఫలమైంది. దీంతో గంగారామ్‌ భార్యను చంపేయాలని నిర్ణయానికి వచ్చింది. బెలవెత్త గ్రామంలోని చికెన్‌ షాపులో కత్తిని తీసుకుని శనివారం రాత్రి గంగారామ్‌ ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి వరకు లక్ష్మితో గొడవ పడింది. తెల్లవారుజామున మూడు గంటలకు కత్తితో లక్ష్మపై విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేసింది. నిద్ర లేచి ఏడుస్తున్న నలుగురు పిల్లలను అదే కత్తితో అంతమొందించింది. మృతదేహాలపై బ్లాంకెట్‌ పరిచి ఇంట్లో బీరువాలో ఉన్న దుస్తులను చెల్లాచెదురుగా పడేసి దొంగతనం జరిగినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. కొన్ని నగలను తీసుకును పారిపోయింది. అనంతరం తన దుస్తులను వేరే చోట ఉంచి వేరే ఏదో వాహనంలో స్వగ్రామానికి వెళ్లింది.

భర్త పరాయి మగాడి భార్యను రేప్ చేస్తుంటే వీడియో తీసిన భార్య, ఆ తర్వాత స్నేహితులతో పడుకోవాలని వీడియోతో బ్లాక్ మెయిల్, భార్యభర్తలిద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు

మరుసటి రోజు రోదిస్తూ అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి తన ఇంటికి చేరుకుంది. కత్తిని శుభ్రంగా కడిగి అదే చికెన్‌ షాపులో అప్పగించింది. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హత్యోదంతానికి పాల్పడినట్లు అంగీకరించింది. ఈ ఘటన జరిగినప్పుడు గంగారామ్ హైదరాబాద్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా గంగారామ్ కుటుంబం రాజస్థాన్‌కు చెందిన వారు. కర్ణాటకకు వలస వచ్చిన తర్వాత మాండ్యాలో నివసిస్తున్నారు.