Pune, Feb 9: మహారాష్ట్రలోని పుణేలో దారుణ ఘటన చోటు (Pune Shocker) చేసుకుంది. తనను దూరం పెడుతోందనే ఆగ్రహంతో మాజీ ప్రియురాలిని ఓ వ్యక్తి కడతేర్చిన ఉదంతం పూణేలోని లోహెగాయోన్ ప్రాంతంలో (Pune's Lohegaion area) కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు సునీతా సూర్యవంశీ (39)తో నిందితుడు, బిహార్‌కు చెందిన గులాం షేక్ (42)కు వివాహేతర సంబంధం ఉంది. సునీతా ఇంట్లో అద్దెకు ఉండే గులాం షేక్ క్రమంగా ఆమెకు దగ్గరయ్యాడు. ఇద్దరూ భర్త లేని సమయంలో కలుస్తూ ఉండేవారు. అయితే కోవిడ్ లాక్‌డౌన్ రావడంతో నిందితుడు ఊరి వదిలి సొంత గ్రామానికి వెళ్లాడు.
గ్రామం నుంచి తిరిగివచ్చిన నిందితుడు మహిళతో మళ్లీ సంబంధం కొనసాగించాలని చూశాడు. అయితే అతడితో సంబంధానికి మహిళ నిరాకరించి దూరం పెట్టింది. తమ విషయం కుటుంబసభ్యులకు తెలిసి మందలించడంతో మహిళ అప్పటి నుండి నిందితుడితో మాట్లాడటం మానేసింది. ఇదే విషయమై నిందితుడు మహిళను నిలదీయండంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి ప్రవేశించి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కోపంతో మహిళను ఊపిరాడకుండా చేసి హత్య (man strangles lover to death for breaking up) చేశాడు.
బాధితురాలి భర్త రఘునాధ్ సూర్యవంశీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బిహార్ చేరుకున్నారని త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ భరత్ జాదవ్ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి విమంతల్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, 452, 427 కింద ఫిర్యాదు నమోదైంది.