Supreme Court: జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ బంద్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆంక్షలు సరికాదు, భావ ప్రకటనా స్వేచ్ఛని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు, అన్ని ఆంక్షలను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. వారం రోజుల్లో కశ్మీర్‌లోని అన్ని ఆంక్షలను సమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్‌పై (Internet) అపరిమిత ఆంక్షలు సరికాదని, ఆంక్షలకు సంబంధించిన ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
New Delhi, January 10: జమ్మూ కాశ్మీర్‌లో (Jammu and Kashmir) కొద్ది రోజులుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court )కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. వారం రోజుల్లో కశ్మీర్‌లోని అన్ని ఆంక్షలను సమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్‌పై (Internet) అపరిమిత ఆంక్షలు సరికాదని, ఆంక్షలకు సంబంధించిన ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
ఇంటర్నెట్ సేవలను శాశ్వతంగా నిలిపివేయడానికి అనుమతించం అని కోర్టు స్పష్టం చేసింది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసే ఉత్తర్వులు న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్ కలిగి ఉండటం భావప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగం అని చెప్పింది. నెట్ కలిగి ఉండడం భావ ప్రకటన స్వేచ్చలో అంతర్బాగం అని వెల్లడించింది. రాజ్యాంగంలోని 19కి తూట్లు పొడుస్తారా అని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా అధికారం చెలాయించరాదని సూచించింది.
Here's The ANI Tweet:
ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం టెలికాం నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎలాంటి గడువు లేకుండా నిరవధికంగా సేవలను ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఈ- బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు ఉంటే వారానికోసారి సమీక్షించాలి అని సూచించింది.
కశ్మీర్ ఎన్నో దాడులను ఎదుర్కొంది,ప్రజల స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణపై భద్రతా అంశాలను పరిశీలించాం. ఇంటర్నెట్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయలేం. ఇటీవలి కాలంలో భావ ప్రకటనకు సాధనంగా ఇంటర్నెట్ మారింది. ఇంటర్నెట్‌పై అపరిమిత ఆంక్షలు సరికాదు. మానవ హక్కులు, స్వేచ్ఛా సమతుల్యం అయ్యేలా చూడటం న్యాయస్థానం పని అని కోర్టు స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్‌లో 370ని (Article 370) రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తన్నట్లు కేంద్రం వెల్లడించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు సుప్రీం తలుపులు తట్టారు. పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.