Kerala Doctor Dies By Suicide: కేరళలో విషాదం, వరుడు కట్నం డిమాండ్ చేయడంతో ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు

కట్నం కారణంతో వరుడు పెళ్లి క్యాన్సిల్ చేశాడని ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న షహానా మంగళవారం ఉదయం ఇన్‌స్టిట్యూట్ సమీపంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది

Representational Image (Photo Credits: File Image)

కేరళలో దారుణం జరిగింది. కట్నం కారణంతో వరుడు పెళ్లి క్యాన్సిల్ చేశాడని ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న షహానా మంగళవారం ఉదయం ఇన్‌స్టిట్యూట్ సమీపంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. పీజీ డాక్టర్‌ అయిన తన స్నేహితుడు పెళ్లి ప్రస్తావన నుంచి విరమించుకోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపించారు.

షహానా కుటుంబాన్ని పరామర్శించిన కేరళ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అడ్వకేట్ సతీదేవి.. ఈ అంశంపై సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ పోలీసుల నుంచి నివేదిక కోరనుంది.

సరదా కోసం స్నేహితుడి వెనక భాగంలో ఎయిర్ కంప్రెసర్ గొట్టం దూర్చిన మరో స్నేహితుడు, ఒక్కసారిగా గాలి పేలుడు రావడంతో గాయాలతో యువకుడు మృతి

ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ అన్ని బాధ్యతల నుంచి తొలగించింది.తిరువనంతపురం మెడికల్ కాలేజీలో మహిళా పీజీ డాక్టర్ ఆత్మహత్యపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్.. మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు.