Kerala Lockdown Extended: జూన్ 9 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కారు, అత్యవసరమైన కార్యకలాపాలకు కొంత సండలింపులు

అత్యవసరమైన కార్యకలాపాలకు మాత్రమే కొంత సండలింపులు ఇస్తూ.. జూన్‌ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను సీఎం పినరయి విజయన్‌ పొడగించారు.

Kerala extends COVID-19 lockdown till June 9 (Photo-PTI)

Thiruvananthapuram, May 30: కేరళ ప్రభుత్వం మరో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ను (Kerala Lockdown Extended) పొడిగించింది. అత్యవసరమైన కార్యకలాపాలకు మాత్రమే కొంత సండలింపులు ఇస్తూ.. జూన్‌ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను సీఎం పినరయి విజయన్‌ పొడగించారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. కరోనావైరస్‌ కేసులు గణనీయంగా తగ్గుతున్నప్పటికీ ఆంక్షలను తొలగించే దశకు చేరుకోలేదని, ఈ నెల 31 నుంచి జూన్‌ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని సీఎం (Kerala Chief Minister Pinarayi Vijayan) తెలిపారు.

కేరళలో గ‌డ‌చిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా క‌రోనా కేసులు (Covid in Kerala) న‌మోద‌య్యాయి. శనివారం కొత్త‌గా 23,513 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 24,64,360కు చేరింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనాతో 198 మంది క‌న్నుమూశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య‌ 8,455 కు చేరింది.

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 1,65,553 మందికి కోవిడ్, 3,460 మంది మృతితో 3,25,972 కు పెరిగిన మరణాల సంఖ్య, ఇప్పటి వరకు 21 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు తెలిపిన కేంద్రం

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 22,52,505 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 2,33,034గా ఉంది. రాష్ట్రంలో కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డిన‌ వారిలో 86 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. గత 24 గంటల్లో 1,41,759 క‌రోనా టెస్టులు చేశారు. తాజాగా క‌రోనా వ్యాప్తి రేటు 16.59 శాతానికి చేరుకుంది.

Here's Kerala CM Yweet

కాగా కరోనా కేసులు భారీగా పెరగడంతో మే 8న ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలులోకి తీసుకువచ్చింది. అనంతరం 16న, 23న మరోసారి పొడగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేసులు ఎక్కువగా ఉన్న మల్లప్పురం జిల్లాలో ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ను అమలు చేయగా.. ఇప్పుడు ఉప సంహరిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇతర జిల్లాలతో పాటు మల్లప్పురంలో సాధారణ లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు.

మలప్పురం జిల్లాలో టీపీఆర్ ఈ నెల 23న 31.53 శాతం ఉండగా.. ప్రస్తుతం 17.25 శాతానికి తగ్గింది. గత మూడు రోజుల్లో రాష్ట్రంలో సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు (టీపీఆర్‌) తిరువనంతపురంలో 20.21శాతం, పాలక్కాడ్‌లో 23.86 శాతంగా ఉందని.. మిగతా జిల్లాలో 20 శాతానికంటే తక్కుగానే ఉందని విజయన్‌ తెలిపారు.

చైనాపై మళ్లీ కొత్త కరోనా వేరియంట్ దాడి, తాజాగా 20 కోవిడ్ కేసులు నమోదు, గాంజావ్‌ నగరంలో పూర్తిగా లాక్‌డౌన్, వియత్నాంలో కొత్తగా హైబ్రిడ్‌ మ్యూటెంట్‌ వెలుగులోకి, అక్కడ రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి పుట్టుకొచ్చిన కొత్త సంకర జాతి కరోనా వైరస్‌

ఈ సందర్భంగా కొన్ని మినహాయింపులు ప్రకటించారు. పారిశ్రామిక సంస్థలు ఉద్యోగుల్లో 50 శాతం మించకుండా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. పారిశ్రామిక సంస్థలకు సరఫరా చేసే దుకాణాలు మంగళవారం, గురు, శనివారాల్లో సాయంత్రం 5 గంటల వరకు.. సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.

పుస్తకాలు, బట్టల, ఆభరణాలు, చెప్పుల దుకాణాలు సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 5 గంటల వరకు తెరచుకోవచ్చని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. జూన్‌ మొదటి వారంలో మరింత వ్యాక్సిన్‌ స్టాక్‌ అందుబాటులోకి వస్తుందని, లభ్యత మేరకు టీకా డ్రైవ్‌ను వేగవంతం చేస్తామని చెప్పారు.



సంబంధిత వార్తలు

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ