Kerala Horror: కుటుంబ కలహాలతో కేరళలో దారుణం, కొడుకు కుటుంబం అర్థరాత్రి గాఢ నిద్రలో ఉండగా ఇంటికి నిప్పుపెట్టిన తండ్రి, ఇద్దరు సజీవ దహనం, మరొకరికి తీవ్ర గాయాలు

రాత్రిపూట గాఢనిద్రలో ఉన్న తన కుమారుడు, కోడలు, మనవడిని చంపడానికి వారి గదిలో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు ఓ కసాయి తండ్రి.

Representational Image | (Photo Credits: IANS)

Thrissur, Sep 15: కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాత్రిపూట గాఢనిద్రలో ఉన్న తన కుమారుడు, కోడలు, మనవడిని చంపడానికి వారి గదిలో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటనలో నిందితుడి కుమారుడు, మనవడు సజీవ దహనం కాగా.. కోడలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. ఈ దారుణానికి పాల్పడిన తరువాత నిందితుడు విషం తాగి నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఈ ఘటనపై త్రిస్సూర్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు జాన్సన్‌ బుధవారం అర్ధరాత్రి తన కుమారుడు జోజీ (38), కోడలు లిజీ (33), 12 ఏళ్ల మనవడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో జోజీ, అతడి కుమారుడు మృతిచెందారు. 50 శాతం కాలిన గాయాలతో లిజీ ఎర్నాకుళంలోని ఓ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

మహారాష్ట్రలో దారుణం, 3వ సారి కూడా ఆడపిల్ల పుట్టిందని పసిబిడ్డ నోట్లో పొగాకు కుక్కి చంపిన తండ్రి, నిందితుడినని అరెస్ట్ చేసిన పోలీసులు

కాగా, కుమారుడి కుటుంబానికి నిప్పంటించిన తర్వాత నిందితుడు జాన్సన్‌ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడు కూడా త్రిస్సూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జాన్సన్‌ పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోందని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు