Women Born With 20 Toes And 12 Fingers: శాపంగా మారిన పుట్టుక లోపం, 20 కాలివేళ్లు, చేతులకి 12 వేళ్లతో జన్మించిన ఒడిశా మహిళ నయక్ కుమారి, మంత్రగత్తె అంటూ నిందలు, చేయానికి పాపానికి వివక్షకు గురవుతున్నానంటూ ఆవేదన
పుట్టుకతో వచ్చిన లోపం ఆ వృద్ధురాలికి శాపంగా మారింది. తను అందరిలాంటి మనిషే అయనప్పటికీ పుట్టుకతోనే ఆ మహిళ లోపంతో పుట్టడంతో అందరూ ఆమెను అదోలా చూస్తున్నారు. మంత్రాలు చేస్తున్నావంటూ అవహేలనకు గురిచేస్తున్నారు. నాలుగు గోడల మధ్యనే బంధించి ఆమెను చిత్రవధకు గురిచేస్తున్నారు. దీనికి తోడు పేదరికం ఆమెపాలిట శాపంగా మారింది.
Odisha, November 25: పుట్టుకతో వచ్చిన లోపం ఆ వృద్ధురాలికి శాపంగా మారింది. తను అందరిలాంటి మనిషే అయినప్పటికీ పుట్టుకతోనే ఆ మహిళ లోపంతో పుట్టడంతో అందరూ ఆమెను అదోలా చూస్తున్నారు. మంత్రాలు చేస్తున్నావంటూ అవహేళనకు గురిచేస్తున్నారు. నాలుగు గోడల మధ్యనే బంధించి ఆమెను చిత్రవధకు గురిచేస్తున్నారు. దీనికి తోడు పేదరికం ఆమెపాలిట శాపంగా మారింది. పూర్తి వివరాల్లోకెళితే..
ఒడిశాలోని గంజాంలోని కదపడ గ్రామానికి(Kadapada village of Ganjam district) చెందిన కుమారి నయక్ (Kumari Nayak) పుట్టుకతోనే 20 కాలివేళ్లు, చేతులకి 12 వేళ్లతో (Women Born With 20 Toes And 12 Fingers) జన్మించింది. ఆమె పేదరికంలో జన్మించడంతో (I belong to a poor family) వైద్యానికి నోచుకోలేకపోయింది.దీంతో ఆమెవాటితో పాటే పెరిగి పెద్దవుతూ వచ్చింది.
ANI Tweet
మూఢ నమ్మకాలు ఎక్కువగా నమ్మే ఒడిశాలో ఆమెను ఈ ఊరి ప్రజలు ఓ మంత్రగత్తె(witch)గా చిత్రీకరించారు. తనను మంత్రగత్తె ముద్ర వేసి ఇరుగు పొరుగు వారు తనను ఇల్లు కదలనీయడం లేదని ఆమె వాపోతున్నారు. తాను పుట్టుక లోపంతోనే ఇలా ఉన్నానని, పేదరికం కారణంగా చికిత్స చేయించుకోలేదని తనను మంత్రగత్తెగా స్ధానికులు భావిస్తూ దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐ వెలుగులోకి తీసుకువచ్చింది.
మరోవైపు తమది చిన్నగ్రామమని, ఇక్కడి ప్రజల్లో మూఢనమ్మకాలు పేరుకుపోయాయని, దీంతో ఆమెను మంత్రగత్తెగా అందరూ భావిస్తున్నారని కుమారి దీనగాధను అర్ధం చేసుకున్న ఆ ఊరికే చెందిన మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఒకటి రెండు వేళ్లు అధికంగా ఉండటం అసాధారణమేమీ కాదని సర్జన్ డాక్టర్ పినాకి మహంతి(surgical specialist Dr Pinaki Mohanty) చెప్పారు.
అయితే 20 కాలి వేళ్లు, 12 వేళ్లు ఉండటం అరుదని, జన్యుపరంగా ఇలాంటివి జరగవచ్చని, ప్రతి ఐదు వేల మందిలో ఒకరిద్దరికి ఇలా జరుగుతుందని తెలిపారు. వైద్య పరమైన విషయంలో సామాజిక వివక్ష తగదని ఆయన పేర్కొన్నారు. ఆమెకు అయిన వాళ్లు ఉన్నారా లేరా అనే దానిపై సమాచారం లేదు. ఆమెను ఆదుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఒడిశా ప్రభుత్వం ఆమె దీనగాధను అర్థం చేసుకుని ఆమెకు చికిత్స చేయాలని పలువురు కోరుతున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)