Lalit Modi Health Update: వెంటిలేటర్‌పై ఆక్సిజన్ సపోర్టుతో లలిత్ మోడి, న్యూమోనియా కూడా అటాక్ చేయడంతో విషమించిన ఆరోగ్యం, రెండు వారాల్లో రెండు సార్లు కరోనా

గత రెండు వారాల్లో రెండుసార్లు కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతున్నారు.

Lalit Modi health update (Photo-Instagram/Lalith Modi)

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్‌ మోడీ ఆరోగ్యం (Lalit Modi Health Update) క్షీణించింది. గత రెండు వారాల్లో రెండుసార్లు కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతున్నారు. లండన్‌లోని ఆస్పత్రిలోని ఐసీయూలో లలిత్‌ మోడీ చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ‘రెండు వారాల్లో రెండు సార్లు కరోనా (he tests positive for Covid-19) సోకింది.

కొవిడ్‌ కారణంగా నిర్బంధంలో ఉన్న సమయంలో న్యూమోనియా కూడా అటాక్ అవ్వడంతో చాలా ఇబ్బంది పడుతున్నా. ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇద్దరు వైద్యుల సహాయంతో కలిసి లండన్‌లోని ఆస్పత్రిలో చేరాను. దురదృష్టవశాత్తు ఇప్పటికీ 24/7 బయటి ఆక్సిజన్‌తో (former IPL chairman on oxygen support ) ఉండాల్సి వచ్చింది.

లేటు వయసులో ఘాటు ప్రేమ, బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో లలిత్ మోడీ, త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు వెల్లడి

అందరికీ ధన్యవాదాలు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు లలిత్‌ మోడీ. ఆస్పత్రి బెడ్‌పై తాను ఉన్న ఫొటోస్, వీడియోలను కూడా లలిత్‌ మోడీ ఈ పోస్ట్‌లో షేర్‌ చేశారు. అలాగే కొవిడ్‌ పాజిటివ్‌ రిజల్ట్‌, 87 mm Hg రీడింగ్‌తో కూడిన పల్స్ ఆక్సిమీటర్, ఛాతీ ఎక్స్-రేలను పోస్ట్‌ చేశారు.

నా పుట్టుకే డైమండ్ పుట్టుక, ఆర్థిక నేరగాడు అంటారెందుకు, దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకువచ్చిన లలిత్ మోదీ, ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా అంటూ ట్వీట్

ఇన్‌ప్లు‌ఎంజా, డీప్ న్యుమోనియాతోపాటు రెండువారాల్లో డబుల్ కోవిడ్‌తో మూడు వారాలు నిర్బంధంలో ఉండాల్సి వచ్చిందని మోడీ తెలిపాడు. తనకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మెక్సికోలో ఉన్నానని, ఇప్పుడు ఇద్దరు వైద్యులు సహాయంతో ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్ చేరుకున్నానని చెప్పాడు. ప్లయిట్ ప్రయాణం సజావుగా సాగింది. అయితే, తాను ఇంకా 24గంటలు ఆక్సిజన్‌పైనే ఉన్నానని అన్నారు. నేను కోలుకోవటానికి ఇంకా సమయం పడుతుందని, నేను అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు.

Here's Lalit Modi Tweet

 

View this post on Instagram

 

A post shared by Lalit Modi (@lalitkmodi)

లలిత్ మోడీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై మాజీ క్రికెటర్ హర్భన్ సింగ్ స్పందించాడు. త్వరగా కోలుకోండి అంటూ పేర్కొన్నాడు. బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్ లలిత్ మోడీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. గతేడాది జులైలో సుస్మితా‌సేన్‌తో ఉన్న ఫొటోలతో వారిమధ్య అనుబంధాన్ని లలిత్ మోడీ ప్రకటించారు. సుస్మితను తన బెటర్‌హాఫ్ అని పిలిచాడు. ఇటీవలకాలంలో అతను సుస్మితతో ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫొటోను, ఆమె గురించి లైన్ ఉన్న తన బయోని కూడా మార్చాడు. దీంతో వారి మధ్య బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి.

కాగా గత ఏడాది బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ ఆమెతో కలిసున్న ఫొటోలు షేర్‌ చేశారు లలిత్‌. అవి అప్పట్లో బాగా వైరలయ్యాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే సుస్మితా సేన్ మాత్రం ఈ పుకార్లను పూర్తిగా ఖండించింది. అవన్నీ ఒట్టి వదంతులేనని కొట్టి పారేసింది.