Nandamuri Taraka Rama Rao: అన్న కొడుకు నంద‌మూరి తారక రామారావు టాలీవుడ్ ఎంట్రీపై బెస్ట్ విషెస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్, ఏమన్నాడంటే..

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావును దర్శకుడు వైవీఎస్ చౌదరి మీడియాకు పరిచయం చేశారు. న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Nandamuri hari Krsihna Grand Son Nandamuri Taraka Rama Rao Hero in YVS Chowdhary movie, Junior NTR Best Wishes to him

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావును దర్శకుడు వైవీఎస్ చౌదరి మీడియాకు పరిచయం చేశారు. న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పలు విషయాలను పంచుకునేందుకు వైవీఎస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, అశ్వినీదత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక రామారావును మీడియాకు పరిచయం చేశారు.

త‌న‌ అరెస్టు గురించి చెప్తూ ఎమోష‌న‌ల్ అయిన చంద్ర‌బాబు, అన్ స్టాప‌బుల్ షోలో ఆయ‌న పంచుకున్న వివ‌రాలివే

ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్‌పై అభిమానంతోనే తాను ఇండస్ట్రీకి వచ్చానని, ఆయన ప్రోత్సాహం వల్లే తాను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ తన ముని మనవడి రూపంలో వచ్చారన్నారు. ఎన్టీఆర్ అనే పేరు మూడక్షరాల తారకమంత్రం అయితే, ఈ తారక రామారావుది ఆరడుగుల రూపం అని చెప్పారు. తాను ఇప్పటి వరకు పరిచయం చేసిన హీరోలను అభిమానులు ఆదరించారని, ఈ తారక రామారావును కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు వైవీఎస్ పేర్కొన్నారు.

Here's NTR Tweet

𝐍andamuri 𝐓araka 𝐑amarao is making his entry into Indian cinema

ఈ సంద‌ర్భంగా బెస్ట్ విషెస్ చెబుతూ జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. "రామ్ సినీ ప్ర‌పంచంలోకి నీ మొదటి దశకు ఆల్ ది బెస్ట్. సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీవు చేసే ప్ర‌తి ప్రాజెక్టు విజ‌యం సాధించాలి. నీకు అన్నింటా విజయమే ద‌క్కాల‌ని కోరుకుంటున్నా. ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్‌ల‌ ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నువ్వు క‌చ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటావ‌న్న నమ్మకం నాకుంది. నీ భ‌విష్య‌త్తు దేదీప్య‌మానంగా వెలిగిపోవాలి మై బాయ్" అని తార‌క్ ట్వీట్ చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now