One Nation One Election: జమిలి ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు! కేంద్రానికి షాక్‌ ఇచ్చిన లా కమిషన్, రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందన్న నిపుణులు

2024లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను (One Nation One Election) ఒకేసారి నిర్వహించడం ఇప్పట్లో సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. వాస్తవానికి జమిలి ఎన్నికలకు వెళ్దామని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఇది షాకింగే. ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’కు (One Nation One Election) సంబంధించి లా కమిషన్ నివేదిక సిద్ధమయ్యే అవకాశం ఉంది.

Voting (Photo Credit: ANI)

New Delhi, SEP 29: 2024లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను (One Nation One Election) ఒకేసారి నిర్వహించడం ఇప్పట్లో సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. వాస్తవానికి జమిలి ఎన్నికలకు వెళ్దామని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఇది షాకింగే. ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’కు (One Nation One Election) సంబంధించి లా కమిషన్ నివేదిక సిద్ధమయ్యే అవకాశం ఉంది. లా కమిషన్ తన నివేదికలో ‘‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు ఎలా సాధ్యమవుతాయి? దీని కోసం రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయవలసి ఉంటుంది’’ అని సవివరమైన వాస్తవాలను సమర్పించవచ్చని అంటున్నారు. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో లా కమిషన్ సమావేశం జరిగింది. జమిలి ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అనంతరం.. జమిలి (Jamili Election) ఎన్నికలతో దేశ ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ ఖజానా భారీగా ఆదా చేయవచ్చని లా కమిషన్ భావించింది.

Karnataka Bandh: కావేరి జలాల రగడ, కర్ణాటక బంద్‌తో 44 విమానాలు రద్దు, బెంగుళూరులో 144 సెక్షన్ అమల్లోకి, గత బంద్‌తో రాష్ట్ర ఖజానాకు రూ.1000 నుంచి 1500 కోట్లు నష్టం 

అలాగే తరచుగా ఎన్నికల కారణంగా ఓటర్లలో నిరాసక్తత ఏర్పడుతుందని, ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ శాతం కూడా మెరుగుపడుతుందని లా కమిషన్ అభిప్రాయపడింది. జమిలి అంశాలపై లోతుగా, సుదీర్ఘంగా చర్చించి తన సిఫార్సులతో కూడిన 22వ నివేదికను కేంద్రానికి లా కమిషన్ అందించనుంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌పై లా కమిషన్ స్పందిస్తూ ‘‘ఒక దేశం, ఒకే ఎన్నికలపై నివేదికను ఖరారు చేయడానికి సంబంధించి సంప్రదింపుల కోసం మరికొన్ని సమావేశాలు అవసరం. కొన్ని రాజ్యాంగ సవరణల ద్వారా ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రక్రియను సులభతరం చేస్తాయని మేము నమ్ముతున్నాము’’ అది పేర్కొంది. జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలపై లా కమిషన్ చర్చించింది. ఆ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, 85, 172, 174 , 356 లకు సవరణ చేయాలని చర్చించారు. ఇంకా స్పందిస్తూ.. “ఒక దేశం ఒకే ఎన్నికల ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి, ప్రజలు తమ నాయకులను మరింత తెలివిగా ఎన్నుకుంటారు. ఎందుకంటే ఎన్నికలు ఏదేళ్లలో ఒకేసారి, తగిన సమయం తర్వాత జరుగుతాయి. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే ఓటింగ్ పెరుగుతుంది’’ అని లా కమిషన్ పేర్కొంది.

Farmers Protest: పంజాబ్ రైతులు మ‌ళ్లీ పోరుబాట, త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ మూడు రోజుల రైల్ రోకో ఆందోళ‌న‌, వీడియో ఇదిగో.. 

లోక్‌సభ, అన్ని అసెంబ్లీలు, స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు మోదీ ప్రభుత్వం సెప్టెంబర్ 2న ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి సుభాష్ ఉన్నారు. కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి కూడా ఉన్నారు. అయితే ఈ కమిటీలో చేరేందుకు అధిర్ రంజన్ చౌదరి నిరాకరించారు. ఈ కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 23న జరిగింది. ఈ సమావేశంలో ఇతర పార్టీల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు. జమిలి ఎన్నికలపై 2022 డిసెంబరులోనే లా కమిషన్ అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆరు ప్రశ్నలతో అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై సూచనలు చేసేందుకు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లోని అధికార పార్టీలు, పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు, ఇతర గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now