Mike Tyson: వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..?
బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..?
New Delhi, August 18: దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) గురించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో (Social Media) వైరలవుతుంది. కొద్దిరోజుల క్రితం వరకు లైగర్ (Liger) సినిమా ప్రమోషన్స్ లో బిజిబిజీగా గడిపిన మైక్ టైసన్.. తాజాగా వీల్‌చైర్లో (Wheel Chair) కూర్చొని కదలలేని పరిస్థితిలో కనిపించిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు లెజెండరీ బాక్సర్‌కు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచాన్నే వణికించిన ఆ భారీ గొయ్యి మిస్టరీ వీడింది.. ఏంటా సంగతి?
టైసన్ ఈ స్థితిపై ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. టైసన్ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికా అనే నరాల జబ్బుతో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్లు టైసన్‌ను వీల్ చైర్ వాడాలని సూచించారట.