Santiago, August 18: ఎలా ఏర్పడిందో తెలియదు. రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది. ఊళ్లకు ఊళ్లనే మింగేసేంతగా క్రమంగా పెరుగుతుంది. చిలీ (Chile) దేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్నే (World) వణికిస్తున్న ఓ భారీ గొయ్యి వెనకున్నరహస్యం వీడింది. శాంటియాగోకు (Santiago) 800 కిలోమీటర్ల దూరంలోని, అటకామా రీజియన్‌లో టియెర్రా అమరిల్లా దగ్గర ఈ నెల మొదట్లో ఏర్పడిన గుంత మిస్టరీని శాస్త్రవేత్తలు దాదాపుగా చేధించారు.

చాక్లెట్లు ఆశ చూపి.. ఆరేండ్ల చిన్నారిపై హాస్యనటుడి లైంగిక వేధింపులు.. ఎక్కడ?

మానవ కార్యకలాపాల (Human Causes) వల్లే ఆ భారీ గొయ్యి ఏర్పడిందని నిర్ధారణకు వచ్చేశారు. ఆ ప్రాంతంలో భారీ మైనింగ్‌ (Mining) కార్యకలాపాల వల్ల ఆ గుంత ఏర్పడి ఉంటుందని అంచనాకి వచ్చి.. దానిని పూడ్చేసే ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నారు.