Liquor Prices In Karnataka: మందుబాబులకు షాక్! త్వరలో భారీగా పెరుగనున్న మద్యం ధరలు, ముఖ్యంగా బీర్ రేట్లు పెంచే యోచనలో ప్రభుత్వం
బీర్‌తో పాటు ఇతర ఐఎంఎల్ డ్రింక్స్ ఖరీదైనవిగా మారే అవకాశం ఉండగా, ప్రీమియం బ్రాండ్ ధరల్లో తగుదల ఉండనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖకు ఆదాయ సేకరణ లక్ష్యం రూ.38,525 కోట్లుగా నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.
Bangalore, FEB 17: మందుబాబులకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. త్వరలో మద్యం ధరలు (Liquor Prices) పెరగనున్నాయి. వివిధ కేటగిరీల మద్యానికి పన్ను శ్లాబులు సవరించి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. దీని వల్ల బీర్లలతో పాటు ప్రముఖ బ్రాండ్ల మద్యం ధరలు పెరిగే అవకాశం ఉండగా, ప్రీమియం బ్రాండ్ల ధరల్లో స్వల్పంగా తగ్గుదల ఉండనుంది. అయితే.. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. పొరుగున కర్ణాటక (Karnataka)రాష్ట్రంలో. శుక్రవారం బడ్జెట్ ప్రసంగంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీరు, ఇండియన్ మేడ్ లిక్కర్ (IML) ధరలను పెంచాలని ప్రతిపాదించారు. పన్ను స్లాబ్‌లను హేతుబద్ధీకరించడం, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ధరలను పోటీ పడేలా చేయడం దీని ఉద్దేశం అని చెప్పారు. ఈ క్రమంలోనే IML, బీర్‌లకు పన్ను స్లాబ్‌లను సవరించడం జరుగుతుందన్నారు.
కొత్త పన్ను స్లాబ్‌లు అమల్లోకి వస్తే.. బీర్‌తో పాటు ఇతర ఐఎంఎల్ డ్రింక్స్ ఖరీదైనవిగా మారే అవకాశం ఉండగా, ప్రీమియం బ్రాండ్ ధరల్లో తగుదల ఉండనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖకు ఆదాయ సేకరణ లక్ష్యం రూ.38,525 కోట్లుగా నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. కాగా.. అన్ని బ్రాండ్‌లకు పన్ను శ్లాబులు త్వరలో విడుదల కానున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ప్రీమియం మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు అక్కడ ప్రీమియం మద్యం కొనుగోలు చేసి కర్ణాటకకు తీసుకువస్తున్నారని ఓ అధికారి తెలిపారు. శ్లాబులను మారిస్తే ప్రీమియం ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రంలో ఎంఆర్‌పీ ధరపై కూడా పన్ను ఎక్కువగా ఉంది. మద్యం వాస్తవ ధర పై గరిష్టంగా 83 శాతం దాకా పన్ను విధిస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.