Lok Sabha Elections 2024: నాలుగో దశ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటలకు 62 శాతం పోలింగ్ నమోదు, బెంగాల్‌లో అత్యధికంగా 76 శాతంపైగా పోలింగ్
దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల (Lok Sabha elections) నాలుగో దశ పోలింగ్‌లో సాయంత్రం 3 గంటలకు 62 శాతం ఓటింగ్ నమోదైంది.
Lok Sabha Elections 2024 Phase 4 Polling: దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల (Lok Sabha elections) నాలుగో దశ పోలింగ్‌లో సాయంత్రం 3 గంటలకు 62 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 76.02 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో 68.48 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 52.63 శాతం, జమ్మూకశ్మీర్‌లో అత్పల్పంగా 35.75 శాతం నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్‌లో 68.12 శాతం, జార్ఖండ్‌లో 63.37 శాతం, ఒడిశాలో 63.85 శాతం, తెలంగాణలో 61.29 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 57.76 శాతం, బీహార్‌లో 55.9 శాతం పోలింగ్ నమోదైంది. దేశ వ్యాప్తంగా పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. ఏపీలో టీడీపీ, వైఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగ్గా, బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. కాగా, లోక్‌సభ ఎన్నికల తొలి మూడు దశల్లో వరుసగా 66.14 శాతం, 66.71 శాతం, 65 68 శాతం మేర పోలింగ్ నమోదైంది.