Voting underway across various states in country (Phot Credit: Representative Image)

ఏపీలో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలైన రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరులో అధికారులు సాయంత్రం నాలుగు గంట‌ల‌కే పోలింగ్ ముగించారు. అలాగే తెలంగాణ‌లోని మంచిర్యాల‌, మంథ‌ని, భూపాల‌ప‌ల్లి, ఇల్లందు, పిన‌పాక‌, సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్‌, బెల్లంప‌ల్లి, భ‌ద్రాచ‌లం, కొత్తగూడెం, అశ్వ‌రావుపేట‌, ములుగులో క‌డా 4 గంట‌ల‌కే పోలింగ్ పూర్త‌యింది. అయితే, అప్ప‌టికే క్యూలైన్ల‌లో ఉన్న‌వారికి ఓటేసేందుకు అధికారులు అవ‌కాశం ఇస్తున్నారు. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ కొన‌సాగుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు, ఓటు వేయమని ఇంటింటికి వెళ్ళి చెబుతున్న స్థానికులు, వీడియోఇదిగో..

5 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మ‌హ‌బూబాబాద్, పెద్ద‌ప‌ల్లి, ఆదిలాబాద్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని స‌మ‌స్యాత్మ‌క‌మైన 13 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభ‌మై.. సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంప‌ల్లి, మంచిర్యాల‌, మంథ‌ని, భూపాల‌ప‌ల్లి, ములుగు, పిన‌పాక‌, ఇల్లెందు, భ‌ద్రాచ‌లం, కొత్త‌గూడెం, అశ్వారావుపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ముగిసింది.

సాయంత్రం నాలుగు గంటల లోపు క్యూలైన్లో వేచి ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలింగ్ రోజు వరకు తెలంగాణలో రూ.192 కోట్లను సీజ్ చేసినట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో సాయంత్రం 6 గంట‌ల‌కు పోలింగ్ కొన‌సాగ‌నుంది.