LPG Price Hike: కట్టెల పొయ్యిలే బెటరా, వీధి వ్యాపారులకు మళ్లీ గ్యాస్ పోటు, తాజాగా 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 266 కు పెంపు

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండిర్‌ ధరలను భారీగా పెంచేసేంది. 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను తాజాగా రూ. 266 కు (Commercial LPG Cylinder Price Hiked by Rs 266) పెంచింది.

Commercial LPG Cylinder Price Hiked by Rs 266 (Photo-Representative Image)

New Delhi, November 1: పెట్రోలు, డీజిల్‌ రేట్ల పెంపుతో సతమతం అవుతున్న ప్రజానీకంపై కేంద్రం ఈసారి ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపుతో (LPG Price Hike) విరుచుకుపడింది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండిర్‌ ధరలను భారీగా పెంచేసేంది. 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను తాజాగా రూ. 266 కు (Commercial LPG Cylinder Price Hiked by Rs 266) పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్‌ సిలిండర్‌ ధర రెండు వేల రూపాయలకు అటుఇటుగా నమోదు అవుతోంది. హైదరాబాద్‌లో 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1905.32కి చేరుకుంది.

కాగా ఆగస్టు 17న కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్రం పెంచింది. ఆ తర్వాత రెండు నెలల విరామం ఇచ్చింది. అయితే రెండు నెలల విరామం అనంతరం ఈసారి ఒకేసారి రూ.266 వంతున ధరను పెంచేసింది. భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్​ సిలిండర్‌ ధరతో చిరువ్యాపారులు, వీధివ్యాపారులకు కష్టాలు మొదలయ్యాయి. కరోనాతో పోయిన ఆదాయం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంటే.. ఆ ఆనందం క్షణకాలం కూడా నిలవకుండా పెరుగుతున్న గ్యాస్‌ ధరలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఏపీలో 6.53లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, అమ్మఒడి పథకం కింద నగదు వద్దనుకునే స్టూడెంట్లకు పంపిణీ, ఏపీటీఎస్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం

గత వారం రోజులుగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరుగుతాయనే ఫీలర్లను ప్రభుత్వం వదులుతూ వస్తోంది. అయితే దీపావళి తర్వాత పెంపు ఉండవచ్చని అందరూ భావించారు. కానీ అంతకు ముందే ధరను కేంద్రం పెంచింది. అది కూడా రికార్డు స్థాయిలో రూ.266గా ఉండటం గమనార్హం.ఇదిలా ఉంటే గ్యాస్‌పై అందిస్తున్న సబ్సిడీలను క్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గడిచిన రెండు నెలల కాలంలోనే గృహ, వాణిజ్యపరమైన సిలిండర్ల ధరలు నాలుగు సార్లు పెరిగాయి. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లపై సెప్టెంబరులో రూ. 15 వంతున, అక్టోబరులో రూ. 25వంతున ధర పెంచింది. ఈ ఏడాది మొత్తంగా పరిశీలిస్తే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.205 వంతున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 952లుగా ఉంది.