Malaysian Woman Rape Case: ఆ మాజీ మంత్రి నాపై అత్యాచారం చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన కోలీవుడ్ నటి, ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు, ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపిన మణికందన్
ఆయన్ని బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. మలేషియా పౌరసత్వం ఉన్న కోలీవుడ్ నటి చేసిన అత్యాచార ఆరోపణలతో ( Malaysian Woman Rape Case) మణికందన్ అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
Ex-AIADMK minister M Manikandan Arrested: కోలీవుడ్ నటిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. మలేషియా పౌరసత్వం ఉన్న కోలీవుడ్ నటి చేసిన అత్యాచార ఆరోపణలతో ( Malaysian Woman Rape Case) మణికందన్ అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని కోలీవుడ్ నటి మాజీ మంత్రి మణికందన్‌పై (Ex-AIADMK minister M Manikandan) చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కాగా ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత మణికందన్ పరారీలో ఉన్నాడు తాజాగా ఆయనను (Former Tamil Nadu Minister M Manikandan arrested) అదుపులోకి తీసుకున్నారు. ‘మణికందన్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదేళ్ల పాటు తనతో సహజీవనం చేశాడు. తాను గర్భం దాల్చగా దానిని తొలగించమని బలవంతం చేశాడు. అలా మూడుసార్లు గర్భాన్ని తీయించుకున్నాను. తాను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్న సంగతి విదితమే. తన కుటుంబంపైనా హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మణికంఠన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని..ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె కోరారు.
కోలీవుడ్ నటి ఫిర్యాదుపై మాజీ మంత్రి మణికంఠన్ స్పందించారు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చాలా మంది తనను కలిశారన్నారు. అదే విధంగా ఆ నటి కూడా తనను కలిసి ఉండొచ్చని తెలిపారు. అప్పుడు తనతో తీసుకున్న ఫొటోలు చూపించి తప్పుడు ఫిర్యాదు చేసిందన్నారు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులే ఆ నటిని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనిచేయిస్తున్నారని అన్నారు.
మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి ఆ నటితో కలిసున్న ఫొటోలు తమ వద్ద ఉన్నాయని.. ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. అందుకు తాను అంగీకరించలేదన్నారు. ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మణికందన్‌తో జరిగినట్లుగా వాట్సాప్ ఛాటింగ్‌లను నటి మీడియాకు చూపించి పోలీసులకు సమర్పించింది.
కాగా, 36 ఏళ్ల చాందినికి మలేషియా పౌరసత్వం ఉంది. ‘నడడిగల్, వాగి సూడా వా’ లాంటి సినిమాల్లో ఆమె నటించింది. ఇక మణికందన్ గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేశారు. జయలలితకు ఆప్తుడిగా పేరున్న 41 ఏళ్ల మణికందన్.. అప్పటి మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పళనిస్వామికి వ్యతిరేకంగా టీవీవీ దినకరన్ వేరు కుంపటిలో చేరి మంత్రి పదవిని పొగొట్టుకున్నాడు.