Madhya Pradesh High Court: 10 ఏళ్ళ పాటు సహజీవనం, పెళ్ళి చేసుకోలేదని పురుషుడిపై అత్యాచారం కేసు పెట్టిన మహిళ, షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
న్యాయమూర్తి సంజయ్ ద్వివేది జూలై 2 నాటి తన ఉత్తర్వులో, ఈ కేసు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు
Bhopal, july 8: ఇద్దరు 10 ఏళ్లకు పైగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని మరియు వారి స్వంత స్వేచ్ఛతో శారీరక సంబంధం కలిగి ఉన్నారని పేర్కొంటూ, ఒక వ్యక్తిపై ఒక మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. న్యాయమూర్తి సంజయ్ ద్వివేది జూలై 2 నాటి తన ఉత్తర్వులో, ఈ కేసు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆర్డర్ ప్రకారం, స్త్రీ మరియు పురుషుడు బాగా చదువుకున్న వ్యక్తులు, వీరు 10 సంవత్సరాలకు పైగా ఏకాభిప్రాయంతో శారీరక సంబంధం కలిగి ఉన్నారు. ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో వారు తమ సంబంధాన్ని ముగించారు. పిటిషనర్ (పురుషుడు)పై అత్యాచారం కేసు నమోదు చేయడాన్ని ఇది సమర్థించదని కోర్టు పేర్కొంది. పుట్టింటి నుంచి భార్య తెచ్చుకునే బంగారంపై భర్తకు హక్కు ఉండదు.. అదేం ఉమ్మడి ఆస్తి కాదు.. ఇబ్బందుల్లో ఆ బంగారాన్ని భర్త వాడుకున్నా.. దాన్ని మళ్లీ భార్యకు తిరిగి ఇవ్వాల్సిందే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
కేసు అసలు విషయంలోకి వెళ్తే.. ధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 2021లో ఓ మహిళ ఆమె భాగస్వామిపై కేసు పెట్టింది. అత్యాచారం, ఇతర అభియోగాల కింద ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. అయితే తనపై కేసులు అక్రమమని, తనకు ఉపశమనం కల్పించాలంటూ పురుషుడు హైకోర్టును ఆశ్రయించాడు. వీరిద్దరూ ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛగా పదేళ్ల పాటు శారీరక సంబంధాన్ని కొనసాగించారు. అయితే ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకునేందుకు అతను నిరాకరించాడు. దీంతో సదరు వ్యక్తిపై మహిళ కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం పిటిషనర్‌పై (పురుషుడు) అత్యాచారం కేసు నమోదు చేయడం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు పిటిషనర్‌పై కేసు కొట్టివేయాలంటూ జులై 2న కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కేసు వాస్తవ పరిస్థితుల ప్రకారం... ప్రతివాది (మహిళ) ఫిర్యాదు, ఐపీసీలోని సీఆర్‌పీసీ 164 కింద ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఐపీసీ సెక్షన్ 375 కింద దీనిని రేప్ కేసుగా పరిగణించలేము అనేది నా అభిప్రాయం. ఈ కేసు విచారణ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కనిపిస్తోంది’’ అని జస్టిస్ సంజయ్ ద్వివేది వ్యాఖ్యానించారు.
స్త్రీ, పురుషుడు ఇద్దరూ బాగా చదువుకున్న వ్యక్తులు అని, ఏకాభిప్రాయంతో ఇద్దరూ 10 ఏళ్లకుపైగా శారీరక సంబంధాన్ని కొనసాగించారని తేలిందని కోర్టు వెల్లడించింది. ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోబోనని నిరాకరించడంతో ఇద్దరి మధ్య బంధం తెగిపోయిందని, పురుషుడిపై అత్యాచారం కేసు నమోదు చేయడం సబబు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. స్త్రీని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ కూడా పురుషుడిపై కేసు పెట్టలేమని (ఐపీసీ సెక్షన్ 366) కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి పురుషుడిపై ఆ తర్వాతి కాలంలో ఐపీసీ సెక్షన్ 366 కింద పెట్టిన కేసును కూడా రద్దు చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.