Ravi Uppal Arrest: మ‌హ‌దేవ్ బెట్టింగ్ యాప్ ఓన‌ర్ అరెస్ట్, దుబాయ్ లో అదుపులోకి తీసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, కేసులో ర‌ణ్ బీర్, శ్ర‌ద్ధా స‌హా ప‌లువురు బాలీవుడ్ తార‌ల పేర్లు

రవి ఉప్పల్‌ను (Ravi Uppal Arrest) భారత్‌కు రప్పించేందుకు అరబ్ దేశాధికారులతో ఈడీ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారని మనీలాండరింగ్ నిరోధక సంస్థ ఈడీ తెలిపింది.

Enforcement Directorate (Photo Credit: ANI)

New Delhi, DEC 13: మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ (Mahadev Betting App) కేసులో నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను (Ravi uppal arrest) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దుబాయ్ లో అదుపులోకి తీసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) ఉన్న రవిని ఇంటర్‌పోల్ ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గత వారం నిర్బంధంలో ఉన్న రవి ఉప్పల్‌ను (Ravi Uppal Arrest) భారత్‌కు రప్పించేందుకు అరబ్ దేశాధికారులతో ఈడీ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారని మనీలాండరింగ్ నిరోధక సంస్థ ఈడీ తెలిపింది.

 

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ నగరంలో మనీలాండరింగ్ యాక్ట్ కింద రవి, ఇంటర్నెట్ ఆధారిత బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌కు చెందిన మరో ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. ముంబయి పోలీసులు కూడా రవిపై కేసును విచారిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రవి, ఇతరులు మనీలాండరింగ్, హవాలా లావాదేవీలకు పాల్పడుతున్నరని తేలింది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Bomb Blast Threat Call to Raj Bhavan: కర్ణాటక రాజ్‌భవన్‌ను బాంబులతో పేల్చేస్తామపి బెదిరింపు కాల్, అప్రమత్తమైన బెంగుళూరు పోలీసులు 

ఈడీ బెట్టింగ్ యాప్ విచారణ సందర్భంగా సినీనటులు రణబీర్ కపూర్ (Ranbir Kapoor), శ్రద్ధా కపూర్ (Shradda Kapoor), హుమా ఖురేషి, కపిల్ శర్మ, బోమన్ ఇరానీ,హీనా ఖాన్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. రవి, చంద్రాకర్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారు బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి నగదును స్వీకరించినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.



సంబంధిత వార్తలు

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో