కర్ణాటక రాజ్‌భవన్‌ (Raj Bhavan)కు బాంబు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్‌ చేశాడు. రాజ్‌భవన్‌పై బాంబులు వేస్తామంటూ హెచ్చరించాడు (bomb threat call ). దీంతో పోలీసులు వెంటనే అలర్ట్‌ అయ్యారు. రాజ్‌భవన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబును వెతికేందుకు వెంటనే రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, కే-9 యూనిట్లతో రాజ్‌భవన్‌ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువూ వారికి కనిపించలేదు. మరోవైపు ఫోన్‌కాల్‌ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)