Maharashtra Tragedy: ఆలయంలో కుప్పకూలిన 100 ఏళ్ల నాటి వేపచెట్టు, ఏడు మంది మృతి, మరో 23 మందికి గాయాలు
అకోలా జిల్లాలోని బాబూజీ మహరాజ్ ఆలయంలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో బాబూజీ మహరాజ్ ఆలయంలో మహా హారతి నిర్వహించారు.
Mumbai, April 10: మహారాష్ట్ర (Maharashtra)లో ఓ ఆలయ (Temple) ప్రాంగణంలో భారీ వృక్షం కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అకోలా జిల్లాలోని బాబూజీ మహరాజ్ ఆలయంలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో బాబూజీ మహరాజ్ ఆలయంలో మహా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అయితే, అకోలా జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న 100 ఏళ్ల నాటి భారీ వేప వృక్షం (Neem Tree) దెబ్బతింది.
నిన్న పూజలు జరుగుతున్న సమయంలో అది సమీపంలోని రేకుల షెడ్డుపై పడిపోయింది. దీంతో ఆ షెడ్డు కుప్పకూలి దాని కింద భక్తులు చిక్కుకుపోయారు.ఈ ఘటనలో ఏడుగురు భక్తులు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఘటనపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు.