Maharashtra Blast: ఒక్కసారిగా పేలుడు, నలుగురి సజీవ దహనం, పలువురికి తీవ్ర గాయాలు, మహారాష్ట్రలో రత్నాగిరి జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన
రత్నాగిరి జిల్లాలోని ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఘర్డా కెమికల్స్ వద్ద శనివారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి (Explosion at Chemical Factory in Ratnagiri) ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే సజీవ దహనం (: 4 Dead, One Critically Injured) కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Mumbai, Mar 20: మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని (Maharashtra Blast) నింపింది. రత్నాగిరి జిల్లాలోని ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఘర్డా కెమికల్స్ వద్ద శనివారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి (Explosion at Chemical Factory in Ratnagiri) ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే సజీవ దహనం (4 Dead, One Critically Injured) కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఇరుక్కున్న 40 -50మందిని అగ్నిమాపక దళ సిబ్బంది రక్షించింది. క్షతగాత్రులను సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలించిన అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తీవ్రంగా గాయపడినవారిని ముంబైకి తరలిస్తున్నారు.
ఈ ప్రమాదం వెనుక గల కారణాన్ని ఇంకా నిర్ధారించలేదు. అయితే బాయిలర్ పేలుడు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.