Maharashtra Lockdown: మరోసారి లాక్‌డౌన్,  ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే, పుణేలో రికార్డుస్థాయిలో కేసులు నమోదు

కేసుల సంఖ్య ఇలానే పెరిగితే.. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ (Maharashtra Lockdown) విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Maharashtra Chief Minister Uddhav Thackeray (Photo Credits: ANI)

Mumbai, Feb 22: గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని యవత్మాల్, చంద్రపూర్, నాందేడ్, జిల్లాలతోపాటు నాగపూర్, అమరావతి జిల్లాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమరావతిలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ (Lockdown) అమలు చేస్తున్నారు. అదేవిధంగా నాగపూర్‌లో గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైయ్యాయి.

పూణేలో ఒక్క రోజులో 1176 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా, ఆరుగురు కరోనాతో మరణించారు. దీంతో మహారాష్ట్ర సర్కారు సోమవారం నుంచి మత, రాజకీయ పరమైన సమావేశాలను నిషేధించింది. పూణే జిల్లాలో 7,355 యాక్టివ్ కరోనా కేసులు నమోదైనాయి. మొత్తం పూణే జిల్లాలో 3,98,607 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 9,183కు పెరిగింది. పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యతో పూణే నగరంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధించారు. మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే (Maharashtra Chief Minister Uddhav Thackeray) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసుల సంఖ్య ఇలానే పెరిగితే.. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ (Maharashtra Lockdown) విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రానున్న 8-15 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇలానే పెరిగితే... ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. మారో సారి లాక్‌డౌన్‌ విధించాలని మీరు కోరుకుంటున్నారా. మీరు ఇంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. లాక్‌డౌన్‌ తప్పదు. వద్దనుకున్నవారు మాస్క్‌ ధరించండి.. లాక్‌డౌన్‌ కావాలి అనుకునే వారు మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ వల్ల అందరు ఇబ్బంది పడతారనే విషయం గుర్తించాలి’’ అన్నారు.

మళ్లీ వారం రోజుల పాటు లాక్‌డౌన్, నేటి రాత్రి నుంచి మార్చి 1 వరకు మహారాష్ట్రలో ఏడు జిల్లాల్లో లాక్‌డౌన్ అమలు, మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు కరోనా, దేశంలో తాజాగా 14,199 కొత్త కేసులు, ఏపీలో 88 మందికి కోవిడ్

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుందా లేదా అన్న విషయం త్వరలోనే తెలుస్తుంది. ఇప్పటికే అమరావతి, అకోలా వంటి ప్రాంతాల్లో పరిస్థితి చేయి దాటి పోయింది. దాంతో అక్కడ లాక్‌డౌన్‌ విధించాం’’ అన్నారు. మహారాష్ట్రలో కొత్తగా ఆదివారం 6,281 కోవిడ్‌ కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు శనివారం ప్రకటించారు.

కరోనా రోగులపై మళ్లీ కొత్త స్ట్రెయిన్లు దాడి, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం కష్టమని తెలిపిన ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా, ఆరు రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాప్తి

దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,93,913 కు చేరుకుంది. తాజాగా మహారాష్ట్ర మంత్రి చాగన్‌ భుజ్బాల్‌కి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన సోమవారం ఉదయం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని.. గత కొద్ది రోజులుగా తనని కలిసిన వారందరు పరీక్షి చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif