Marathi Language: స్కూళ్లలో మరాఠీ భాష తప్పనిసరి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, అమలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన విద్యా శాఖాధికారి విశ్వజిత్

ఇకనుంచి ప్రతీ స్కూల్స్ లోను మరాఠీ భాషను(Marathi Language) తప్పనిసరి చేయాల్సిందేనని చెబుతోంది. దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

Maharashtra CM and Shiv Sena chief Uddhav Thackeray (File Photo| PTI)

Mumbai, January 18: ఉద్ధవ్ థాకరే నేతృత్త్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra government) తల్లి భాష లాంటి మాతృభాష అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతీ స్కూల్స్ లోను మరాఠీ భాషను(Marathi Language) తప్పనిసరి చేయాల్సిందేనని చెబుతోంది. దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

సీబీఎస్సీ, ఐసీఎస్సీ(CBSE and ICSE) వంటి స్కూల్స్ తప్పిస్తే మిగతా అన్ని స్కూల్స్ లోను మరాఠీని విధిగా అమలు చేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Chief Minister Uddhav Thackeray)అధికారులకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సంబంధిత అధికారులు స్కూల్స్ లో మరాఠీని తప్పనిసరి చేస్తూ(Marathi compulsory in all schools) సర్క్యులర్ జారీ చేశారు.

మీరిలా ఉంటే సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేస్తారు

ఇప్పటికే అన్ని స్కూల్స్ కు దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ అయినా పలు స్కూల్స్ దీనిని అమలు చేయడానికి ఇష్డపటంలేదు. మరాఠీ భాషను విధిగా అమలు చేయాలన్న చట్టం ఇప్పటి వరకైతే లేదు కానీ, కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే స్కూల్స్ దీనిని ఎందుకు అమలు చేయడం లేదని ఓ అధికారి సూటిగా ప్రశ్నించారు. దీనిపై విద్యా శాఖాధికారి విశ్వజిత్ వివరణ ఇచ్చారు.

మహా’ సర్కారు కీలక నిర్ణయం, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ

మరాఠీని విధిగా అమలు చేయాల్సిందేనన్న చట్టాన్ని తీసుకురాబోతున్నాం. మహారాష్ట్రలో (Maharashtra)నివసిస్తున్నారు కాబట్టి కచ్చితంగా మరాఠీలో మాట్లాడటం, రాయడం చేయాలి. ఈ నిర్ణయాన్ని అన్ని స్కూల్స్ తప్పనిసరిగా అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయకుంటే ఆయా స్కూల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

300 మంది రైతుల ఆత్మహత్యలు, మహారాష్ట్రలో అధికార కుమ్ములాటకు బలైన కర్షకులెందరో

తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తరహాలో, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాథమిక పాఠశాలల్లో మరాఠీని తప్పనిసరి చేయడానికి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఆమోదించాలని నిర్ణయించిందని ఓ అధికారి తెలిపారు.

కీలక శాఖలన్నీ ఎన్పీపీ గుప్పెట్లో

2022 లో మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరాఠీ ఓటు బ్యాంకును కేంద్రీకృతం చేయడానికి శివసేన ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.