Shiv Sena chief Uddhav Thackeray Swearing-in ceremony. (Photo Credits: IANS)

Nagpur, December 22: అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra GOVT)సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర రైతులకు (Farmers)తీపికబురును అందిస్తూ ఉద్ధవ్ సర్కారు రైతు రుణమాఫీ(Farmer Loan Waiver) అమలు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) అసెంబ్లీలో ప్రకటన చేశారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే రుణాల రద్దు పథకం కింద రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం అసెంబ్లీలో తెలిపారు. రైతు రుణాలను నేరుగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయనున్నట్లు సీఎం తెలిపారు.

2019 సెప్టెంబర్‌ 30 వరకూ ఉన్న రుణాలు మాఫీ చేయనున్నట్లు చెప్పారు. నాగ్ పూర్‌లో (Nagpur)జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శనివారం ఆయన ఈ ప్రకటన చేశారు. మాఫీకి అర్హత పొందేందుకు కొన్ని పత్రాలు అవసరమవుతాయని చెప్పారు. దీని వల్ల రూ. 40 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఈ కార్యక్రమం మార్చి-2020లో అమలు చేస్తామని సీఎం ఉద్దవ్‌ ఠాక్రే తెలిపారు.

Read the Tweet Below

సీఎం చేసిన ఈ ప్రకటనకు విపక్ష బీజేపీ(BJP) అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల రుణాలు మొత్తం మాఫీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. మొత్తం రుణాలు మాఫీ చేయడం కుదరదనీ, ప్రభుత్వంపై భారీగా ఒత్తిడి పడుతుందన్న ఆయన రూ. 2 లక్షల వరకే రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు.

లోన్ల మాఫీ కోసం గత ప్రభుత్వంలో మాదిరి గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి జయంత్‌ పాటిల్‌ చెప్పారు. కేవలం ఆధార్‌ కార్డుతో బ్యాంకుకు వెళితే సరిపోతుందని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులని చెప్పారు.

సీఎం ప్రభుత్వ నిర్ణయం తెలుపగానే.. ప్రతిపక్ష బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసింది.రుణమాఫీకి రూ. 2 లక్షల పరిమితి పెట్టడంపై బీజేపీ మండిపడింది. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ఉద్ధవ్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) ఆరోపించారు.

దీనిపై తాము రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని చెప్పారు. అకాల వర్షం (Unseasonal Rain)కారణంగా అక్టోబర్‌ నెలలో పంట నష్టంతో దెబ్బ తిన్న రైతులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. కాగా 2017లో అప్పటి బీజేపీ–శివసేన ప్రభుత్వం 50 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19 వేల కోట్ల రుణాలను చెల్లించింది.