Covid pandemic: మరో ఆరు నెలలు మాస్క్ వాడాల్సిందే, నైట్‌ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌ పెట్టడం ఇష్టం లేదని తెలిపిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే

రాష్ట్ర ప్రజలు మరో ఆరు నెలల పాటు మాస్కులు తప్పని సరిగా పెట్టుకోవల్సిందేనని (Masks mandatory) స్పష్టం చేశారు.

File Image of Uddhav Thackeray | File Photo

Mumbai, Dec 20: మహారాష్ట్రలో మాస్కుల వినియోగంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే (Covid in Maharashtra) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు మరో ఆరు నెలల పాటు మాస్కులు తప్పని సరిగా పెట్టుకోవల్సిందేనని (Masks mandatory) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన (Maharashtra chief minister Uddhav Thackeray) సోషల్‌ మీడియా వేదికగా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ‘‘ నివారణ కంటే ముందు జాగ్రత్త ఎంతో ఉత్తమమని అన్నారు. పబ్లిక్‌ ప్రదేశాలలో మాస్కులను ధరించటం అలవాటుగా మారాలి. ప్రజలు తప్పని సరిగా మరో ఆరు నెలల పాటు మాస్కులు పెట్టుకోవాలి. నైట్‌ కర్ఫ్యూలు విధించాలని, వీలైతే మరో లాక్‌డౌన్‌ పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అయితే నాకది ఇష్టం లేదు. అంతా కాకపోయినా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని అన్నారు. కాగా, మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 3,940 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,92,707 చేరింది. గడిచిన 24 గంటల్లో 74 మంది కరోనాతో మృత్యువాతపడగా ఇప్పటి వరకు మొత్తం 48,648 మంది మరణించారు.

దేశ వ్యాప్తంగా అమరులైన రైతులకు నివాళి, లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలు, కార్యాచరణను ప్రకటించిన రైతు సంఘాలు

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య కోటి 30వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 26,624 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 1,00,31,223కు చేరింది. శనివారం 341 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 1,45,477 మంది ప్రాణాలు కోల్పోయారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif