Gulabrao Patil Remarks Row: హేమమాలిని బుగ్గల వ్యాఖ్యలపై సారీ చెప్పిన మ‌హారాష్ట్ర మంత్రి గులాబ్ రావ్ పాటిల్, ఆ వ్యాఖ్య‌లను ప‌ట్టించుకోన‌ని తెలిపిన బీజేపీ ఎంపీ మాలిని

తన నియోజ‌క‌వ‌ర్గంలోని రోడ్ల‌ను న‌టి, ఎంపీ హేమామాలిని బుగ్గ‌ల‌తో పోలుస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో మ‌హిళా సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి

Gulabrao Patil (Photo-Facebook)

Mumbai, Dec 20: మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన నేత గులాబ్ రావ్ పాటిల్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు (Gulabrao Patil Remarks) చేసిన సంగతి విదితమే. తన నియోజ‌క‌వ‌ర్గంలోని రోడ్ల‌ను న‌టి, ఎంపీ హేమామాలిని బుగ్గ‌ల‌తో పోలుస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో మ‌హిళా సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. ఆయ‌న వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ డిమాండ్ చేసింది. వెంటనే తన వ్యాఖ్యలపై ఆయన (Maharashtra minister Gulabrao Patil) క్షమాపణ కోరారు.

మహారాష్ట్ర నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ మంత్రి, శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్ ఆదివారం జల్గావ్ జిల్లాలోని ధరంగావ్‌లోని తన నియోజకవర్గంలోని రోడ్లను బాలీవుడ్ స్టార్, బిజెపి ఎంపి హేమమాలిని చెంపలతో ( Hema Malini's cheeks) పోల్చుతూ..ఈ రోడ్లు ఆమె చెంపలు లాగే చాలా మృదువైనవిగా అందంగా ఉన్నాయని చెప్పారు. ”గ‌త 30 సంవ‌త్స‌రాలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారంద‌రూ నా నియోజ‌క‌వ‌ర్గానికి విచ్చేయండి. రోడ్ల‌ను చూడండి. హేమామాలిని బుగ్గ‌లు గ‌న‌క వారికి న‌చ్చ‌కుంటే నేను రాజీనామా చేసేస్తాను.” అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలో వైర‌ల్ గా మారడంతో ఆయన క్షమాపణ కోరారు.

ఒమిక్రాన్ దడ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి, దేనికైనా రెడీ ఉండాలని తెలిపిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా

ఈ వ్యాఖ్య‌ల‌పై ఇవాళ హేమ‌మాలిని ( Hema Malini ) స్పందించారు. రోడ్ల‌ను నటీమ‌ణుల బుగ్గ‌ల‌తో పోల్చే సాంప్ర‌దాయాన్ని గ‌తంలో ఆర్జేడీ అధ్య‌క్షుడు లాలూప్ర‌సాద్ యాద‌వ్ మొద‌లుపెట్టార‌ని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు అదే సాంప్ర‌దాయాన్ని అంద‌రూ అనుస‌రిస్తున్నార‌న్నారు. అయితే ఇలాంటి కామెంట్‌లు మంచివి కావ‌ని హేమ‌మాలిని వ్యాఖ్యానించారు. సాధార‌ణ ప్ర‌జ‌లు ఇలాంటి కామెంట్లు చేస్తే పెద్ద‌గా త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని, కానీ గౌర‌వ హోదాల్లో ఉన్న‌వాళ్లు, ప్ర‌జాప్ర‌తినిధులు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం క‌రెక్టు కాద‌ని అన్నారు. మీ బుగ్గ‌ల‌పై కామెంట్ చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను క్ష‌మాప‌ణ కోరుతారా..? అని మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించ‌గా.. తాను ఆ వ్యాఖ్య‌లను ప‌ట్టించుకోన‌ని హేమ‌మాలిని స్ప‌ష్టంచేశారు.



సంబంధిత వార్తలు

Minister Seethakka: శ్రీతేజ్‌ను పరామర్శించిన మంత్రి సీతక్క..చిన్నారిని చూసి భావోద్వేగానికి లోనైన సీతక్క, శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పిన మంత్రి

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ