Pune, December 20: యునైటెడ్ కింగ్‌డమ్‌లో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా, భారతదేశం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని (We Should Prepare) ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆదివారం అన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నట్లుగా భారత్ లో పరిస్థితి ఉండకపోవచ్చని.. అయినా మేము కార్యాచరణను సిద్ధం చేయాలని తెలిపారు.
మాకు ఓమిక్రాన్‌లో (Omicron Scare in India) మరింత డేటా అవసరం. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కేసులు పెరిగినప్పుడల్లా, మేము దానిని నిశితంగా పరిశీలించాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి. దీన్నిచూస్తూ ఉండటం కంటే ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండడం మేలు" అని గులేరియా (AIIMS Director Dr Randeep Guleria) ANIతో మాట్లాడుతూ అన్నారు.
వైద్య నిపుణుల ఒక సభలో ఆయన మాట్లాడుతూ..కరోనా వైరస్ కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్లు ప్రభావం చూపకపోవడానికి గల కారణం వైరస్‌లో కొత్త మ్యూటేషన్లు జరగడమే. ఇలాంటి సమస్యను అధిగమించడానికి ప్రస్తుత వ్యాక్సిన్లలో కొత్త వేరియంట్లకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు. అలా చేసుకుంటే వైరస్‌పై వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి ” అని అన్నారు. వ్యాక్సిన్లు ఒకేసారి భారీ మొత్తంలో తయారు చేయడంకన్నా ఏడాదికోసారి మార్పులు చేసి సరిపడ మొత్తంలో తయారు చేసుకుంటే మంచిదని, ధనిక దేశాలు ఇప్పటికే భారీ మొత్తంలో వ్యాక్సిన్లు తయారు చేసి ఉంటే వాటిని పేద, మధ్య తరగతి దేశాలకు పంపిణీ చేస్తే అవి వృధా కాకుండా చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో ఇప్పటివరకు 100కి పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. COVID-19 యొక్క కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా నుండి నవంబర్ 25న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కి మొదటిసారి నివేదించబడింది. WHO ప్రకారం, ఈ సంవత్సరం నవంబర్ 9న సేకరించిన నమూనా నుండి B.1.1.529 ఇన్‌ఫెక్షన్ మొదటిసారిగా నిర్ధారించబడింది. నవంబర్ 26న, WHO కొత్త COVID-19 వేరియంట్‌కు B.1.1.529 అని పేరు పెట్టింది, ఇది దక్షిణాఫ్రికాలో కనుగొనబడింది, అన్తరం దీనికి`ఓమిక్రాన్`గా నామకరణం చేసింది. WHO ఓమిక్రాన్‌ను ఆందోళన కర వేరియంట్‌గా వర్గీకరించింది
కొత్తగా ఆదివారం మహారాష్ట్రలో ఆరు, గుజరాత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 140కు పైగా చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 54, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, తెలంగాణ 20, గుజరాత్ 11, కేరళ 11, ఆంధ్రప్రదేశ్ 1, చండీగఢ్ 1, తమిళనాడు 1, పశ్చిమబెంగాల్‌లో 1 చొప్పున రికార్డయ్యాయి.
ఈ కొత్త వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ ఎంతో స్పీడ్‌గా వ్యాప్తి చెందుతున్నదని తెలిపింది. ఇప్పటికే 90కిపైగా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలు పాటించాలని పేరొన్నది. వీలైంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవలని సూచించింది.