Sena Supporter Attempts Suicide: ఆత్మహత్యకు పాల్పడిన శివసేన కార్యకర్త, మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై మనస్థాపం, ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదనే బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారన్న పోలీసులు, మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో ఘటన
మహారాష్ట్ర రాజకీయాలను పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఖుషీలో ఉంటే శివసేన,ఎన్సీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మహా రాజకీయ పరిణామాలతో మనస్తాపం చెందిన శివసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం(Shiv Sena supporter attempts suicide) రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Mumbai, November 24: మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలను కొన్ని పార్టీల కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఖుషీలో ఉంటే శివసేన,ఎన్సీపీ కార్యకర్తలు మాత్రం డైలామాలోకి వెళుతున్నారు. మహా రాజకీయ పరిణామాలతో మనస్తాపం చెందిన శివసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం(Shiv Sena supporter attempts suicide) రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదనే బాధతో శివసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో చోటుచేసుకొన్నది.
పోలీసులు తెలిపిన ప్రకారం.. వాషింలోని ఉమారీ గ్రామానికి చెందిన రమేష్ బాబు జాదవ్ ( Jadhav, a resident of Umari village in Washim) అనే శివసేన కార్యకర్త బీజేపీ దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి(BJP leader Devendra Fadnavis)గా పదవి చేపట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేశాడని, ఇక ఉద్దవ్ థాకరేకు ముఖ్యమంత్రి దక్కదేమోనని(Uddhav Thackeray not becoming the chief minister) మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొన్నాడు. వ్యక్తిగత పని మీద మోనారా చౌక్‌కు వచ్చిన ఆయన శనివారం దారుణానికి పాల్పడ్డాడు అని పోలీసులు పేర్కొన్నారు.
రాత్రికి రాత్రే మారిని రాజకీయ పరిణామాలకు తోడు, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారనే వార్తలతో దిగ్బ్రాంతికి గురైన జాదవ్ తన చేతిని బ్లేడ్‌తో కోసుకొన్నాడు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశాడు. అనంతరం అతడిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతున్నది అని దిగ్రాస్ పోలీస్ స్టేషన్ అధికారి (official at Digras police station) తెలిపారు. కాగా మద్యం మత్తులో జాదవ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ ఆహ్వానించడం వివాదాస్పదమైంది. గవర్నర్ నిర్ణయంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సోమవారం ఉదయం 10.30 లకు విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.