Maharashtra Rain Updates: ముంబైని ముంచెత్తిన భారీ వర్షం, రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ, స్కూళ్లకు సెలవు..వీడియోలు ఇవిగో

భారీ వర్షాలతో రహదారులు జలమయం అయ్యాయి. పలు విమాన సర్వీసులు రద్దు కాగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ఇక ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

Maharashtra Rain Updates IMD issues red alert for Mumbai till tomorrow(video grab)

Hyd, Sep 26:  దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో రహదారులు జలమయం అయ్యాయి. పలు విమాన సర్వీసులు రద్దు కాగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ఇక ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

భారీ వర్షాలతో ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ముంబైలోని కొన్ని ప్రాంతాలలో బుధవారం సాయంత్రం 5 మరియు రాత్రి 10 గంటల మధ్య 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తొలుత ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసిన భారత వాతావరణ విభాగం తర్వాత రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం ఉదయం 8:30 గంటల వరకు ముంబై, థానే మరియు రాయ్‌గఢ్‌లకు రెడ్ అలర్ట్‌గా ప్రకటించింది. పలు చోట్ల భారీ వర్షాలు, ఉరుము లు, మెరుపులు మరియు ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ముంబైకి మళ్లీ భారీ వర్ష సూచన.. రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ.. పాఠశాలలకు సెలవు

Here's Video:

 బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబైలోని అంధేరీలోని ఎంఐడీసీ ప్రాంతంలో ఓపెన్ డ్రెయిన్‌లో విమల్ గైక్వాడ్ అనే 45 ఏళ్ల మహిళ మునిగిపోయింది.

శివాజీనగర్‌లో కుండపోత వర్షం కురియగా 86 సంవత్సరాల తర్వాత ఇంత పెద్దమొత్తంలో వర్షాపాతం రికార్డు అయింది. అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌పై వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Here's Video:



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif