Maharashtra Rain News: భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం,నలుగురు మృతి, లోతట్టు ప్రాంతాల్లో భవనాలు సైతం జలమయం,స్కూళ్లు,కాలేజీలకు సెలవులు
ఎడతెరపిలేని వర్షాలతో ముంబై,తానే నీట మునిగాయి. రోడ్లపై మోకాలు ఎత్తులో నీరు ప్రవహిస్తుండగా ముంబై, తానే లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మహారాష్ట్రలో కొనసాగుతున్న భారీ వర్షాల ప్రభావంతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం పరిస్థితిని సమీక్షించారు. వరదల వల్ల నష్టపోయిన వారందరినీ ఆదుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున పూర్తి సాయం అందిస్తామని చెప్పారు.
Mumbai, July 25: భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో ముంబై,తానే నీట మునిగాయి. రోడ్లపై మోకాలు ఎత్తులో నీరు ప్రవహిస్తుండగా ముంబై, తానే లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మహారాష్ట్రలో కొనసాగుతున్న భారీ వర్షాల ప్రభావంతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం పరిస్థితిని సమీక్షించారు. వరదల వల్ల నష్టపోయిన వారందరినీ ఆదుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున పూర్తి సాయం అందిస్తామని చెప్పారు. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో రాయ్‌గఢ్-పుణె రహదారిపై తమ్హిని ఘాట్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది.గత 24 గంటల్లో శాంతా క్రజ్‌లో 68.1 మిమీ, కోలాబాలో 62.5 మిమీ, థానే జిల్లాలో 120.4 మిమీ వర్షం కురిసింది.
భారీ వర్షాలతో రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. వరద నీటిలో చిక్కుకున్న 70 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడగా వర్షాలతో నలుగురు మృతి చెందారు.
శుక్రవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. పూణెలో ఏక్తా నగరి, విఠల్ నగర్ ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాల్లోకి నీరు చేరింది. వర్షాల కారణంగా ముంబైలోని అంధేరి సబ్‌వేపై రాకపోకలను అధికారులు మూసివేశారు.
కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ముఠా నది ఒడ్డున నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ మీదుగా గంటకు 50 నుండి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని జిల్లా సమాచార కార్యాలయం అంచనా వేసింది. మహారాష్ట్రను ముంచెత్తిన భారీ వర్షాలు, విరిగిపడిన కొండ చరియలు,ఎక్స్ ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ జాం, వీడియో
Here's Video:
#WATCH | Mumbai | Vehicular movement affected near Bandra Kurla Complex as Mumbai continues to reel under heavy and continuous rainfall pic.twitter.com/BBjqDQI469
VIDEO | #Maharashtra: The water level of Pavana River rises following heavy rainfall in Mumbai and nearby areas. #MumbaiRains #MumbaiWeather