Mumbai Shocker: టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు అత్త చేతి వేళ్లు కొరికేసిన కోడలు, అడ్డు వచ్చిన భర్తను కూడా చెప్పుతో కొట్టింది, ముంబైలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు
పెద్దగా శబ్దం చేస్తుందని అత్త అరవడంతో కోడలు కోపంతో ఆమె చేతి వేళ్లను (Woman Bites Mother-In-Law Fingers) కొరికేసింది. మహారాష్ట్ర థానే జిల్లాలోని అంబర్‌నాథ్‌లో అత్త పొద్దున్నే ఇంట్లో పూజలు చేస్తూ.. శ్లోకాలు పఠిస్తోంది.
Thane, Sep 8: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్దగా శబ్దం చేస్తుందని అత్త అరవడంతో కోడలు కోపంతో ఆమె చేతి వేళ్లను (Woman Bites Mother-In-Law Fingers) కొరికేసింది. మహారాష్ట్ర థానే జిల్లాలోని అంబర్‌నాథ్‌లో అత్త పొద్దున్నే ఇంట్లో పూజలు చేస్తూ.. శ్లోకాలు పఠిస్తోంది. అయితే అదే సమయంలో కోడలు పెద్దగా సౌండ్ పెట్టుకుని టీవీలో ఓ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమం చూస్తోంది.
దీంతో అత్త వృశాలి కులకర్ణి కోడలు పిల్లను గట్టిగా అరుస్తూ సౌండ్ (Turning Off TV) తగ్గించమంది. అయితే కోడలు విజయ కులకర్ణి వినకపోవడంతో అత్త వెంటనే వచ్చి టీవి ఆప్ చేసింది. దీంతో అత్తపై మండిపడిన కోడలు ఆమె చేతివేళ్లను కొరికేసింది. వృశాలి కులకర్ణి (60) తన ఇంట్లో భజనలు చదువుతుండగా, ఆమె కోడలు విజయ కులకర్ణి టెలివిజన్ చూస్తుండగా ఈ సంఘటన జరిగిందని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
ఈ ఘటనలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన భర్తను కూడా చెప్పుతో కొట్టిందని ఆయన చెప్పారు.గాయపడిన వృశాలి శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నిందితురాలిపై క్రిమినల్ నేరం నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.