Maharashtra Shocker: కట్టుకున్న భర్తే దారుణంగా, అందరిముందే నగ్నంగా స్నానం చేయించిన మూర్ఖపు భర్త, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, ఫేక్ బాబాపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ దారుణం మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలో వెలుగు చూసింది.
Mumbai, August 23: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మగ బిడ్డ కోసం, డబ్బుపై ఆశతో ఓ శాడిస్ట్ భర్త చేసిన పని అందర్నీ షాక్ కు గురి చేసింది. ఓ మాంత్రికుడి మాటలు నమ్మి తన భార్యను జలపాతం వద్దకు తీసుకువెళ్లి అక్కడ ఆమెతో బహిరంగంగా స్నానం (Woman Forced To Bathe In Public ) చేయించాడు ఓ భర్త. ఈ దారుణం మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలో వెలుగు చూసింది.
పూనా నగరానికి చెందిన భార్యభర్తలకు పెళ్లి అయి ఏళ్లు గడిచిన పిల్లలు పుట్టలేదు. దీంతో పిల్లల కోసం (Ritual To Conceive Son) భర్త ఓ ఫేక్ బాబాని ఆశ్రయించాడు. మాంత్రికుడు సలహా మేర భర్త, భార్యను రాయగడ జిల్లాలోని ఓ జలపాతం వద్దకు తీసుకు వెళ్ళాడు. జలపాతం వద్ద మాంత్రికుడు మంత్రాలు పటిస్తుండగా భర్త బలవంతంగా భార్యతో అందరి ముందు బట్టలు విప్పించి స్నానం చేయించాడు.
భార్యకు పిల్లలు కలగడం లేదని భర్త ఏం చేశాడంటే, బహిరంగంగా స్నానం చేయించిన కార్యక్రమంలో అత్తమామలు కూడా పాల్గొన్నారు. ఈ దారుణమైన ఈ దారుణ ఘటనపై పూణే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జలపాతం వద్ద ప్రజల ముందే భార్యతో స్నానం చేయించడంలో భర్తతోపాటు, అత్తమామలు, మాంత్రికుడు బలవంతం చేశారని పోలీసుల దర్యాప్తు లో తేలింది. దీంతో భర్త, అత్తమామలు, మాంత్రికుడు పై పోలీసులు ఐపిసి 498 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పుణేకి చెందిన ఆమె భర్త కుటుంబం 2013 నుంచి అదనపు కట్నం, మగ బిడ్డ కోసం వేధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె చేత క్షుద్ర పూజలు కూడా చేయించింది. ఈ మధ్య మౌలానా బాబా జామదార్ అనే వ్యక్తి ఆమె భర్తతో జలపాతం కింద అంతా చూస్తుండగా నగ్నంగా భార్యను స్నానం చేయిస్తే.. మగ సంతానం కలుగుతుందని, అప్పులు సైతం తీరతాయని సలహా ఇచ్చాడు. దీంతో ఆ మూర్ఖపు భర్త, అతని కుటుంబం బాధితురాలని రాయ్‌ఘడ్‌కి తీసుకెళ్లి.. అక్కడి జలపాతం కింద ఆమె చేత బలవంతంగా నగ్న స్నానం చేయించాడు. అక్కడ చాలామందే ఉన్నా.. ఎవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. చివరికి.. బాధితురాలే ధైర్యం చేసి భారతీ విద్యాపీఠ్ పోలీసులను ఆశ్రయించింది.