Online Fraud: ఆన్‌లైన్‌లో పుడ్‌ ఆర్డర్‌, రూ.4 లక్షలు హాంఫట్, ఆర్డర్ క్యాన్సిల్ చేసే సమయంలో జాగ్రత్త, ఓటీపీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు

తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరోక ఆన్‌లైన్‌ ఫ్రాడ్ (Online fraud) వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో నివాసముండే ఓ యువకుడు ఆన్‌లైన్‌లో పుడ్‌ ఆర్డర్‌ చేసి రూ.4లక్షలు మోసపోయాడు. అతను పుడ్ ఆర్డర్ చేయగా అది క్వాలిటీ సరిగా లేదని ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నాడు తర్వాత ప్రాసెస్ ద్వారా రూ 4 లక్షలు పోగొట్టుకున్నాడు.

man-loses-4-lakhs-due-calls-customer-care-food-delivery-platform-lucknow ( Photo Credit: Getty )

Lucknow, November 15: ఆన్‌లైన్‌ మోసాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరోక ఆన్‌లైన్‌ ఫ్రాడ్ (Online fraud) వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో నివాసముండే ఓ యువకుడు ఆన్‌లైన్‌లో పుడ్‌ ఆర్డర్‌ చేసి రూ.4లక్షలు మోసపోయాడు. అతను పుడ్ ఆర్డర్ చేయగా అది క్వాలిటీ సరిగా లేదని ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నాడు తర్వాత ప్రాసెస్ ద్వారా రూ 4 లక్షలు పోగొట్టుకున్నాడు.

లక్నోలోని గొమ్తినగర్‌ కు చెందిన ఓ యువకుడు బుధవారం ఓ ప్రముఖ పుడ్‌ డెలివరీ యాప్‌ (food delivery app) ద్వారా పుడ్‌ ఆర్డర్‌ చేసి క్వాలిటీ సరిగా లేదనుకొని ఆర్డన్‌ను క్యాన్సిల్‌ చేశాడు. ఈ క్రమంలో తను చెల్లించిన డబ్బులను తిరిగి పొందడం కోసం ఆన్‌లైన్‌లో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌(customer care number)ను వెతికి కాల్‌ చేశాడు.

ఫోన్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత సమస్య గురించి ఆడిగాడు. డబ్బులు చెల్లించాలంటే తాము పంపిన లింక్‌ను క్లిక్‌ చేసి మరో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. దానికి సమ్మతించిన యువకుడు ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని దాంట్లో బ్యాంక్‌ అకౌంట్‌ (savings bank account) వివరాలను పొందుపరిచాడు.

ఈ క్రమంలో ఓ ఓటీపీ రాగా, అది ఎంటర్‌ చేస్తే డబ్బులు రిఫండ్ (Refund) అవుతాయని నమ్మించాడు. దీంతో ఆ యువకుడు ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేశాడు. వెంటనే అతని అకౌంట్‌లో ఉన్న రూ.4లక్షలు విత్‌డ్రా (Rs 4 lakh was withdrawn from his account) అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో కంగుతిన్న యువకుడు మరలా ఆ నెంబర్‌కు కాల్‌ చేయగా ఎటువంది స్పందన రాలేదు.

మోసపోయానని తెలుసుకున్న యువకుడు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆన్ లైన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.