Mumbai Shocker: నయా మోసగాడు..పెళ్లి పేరుతో 12 మంది యువతులపై లైంగిక దాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు, మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్ ద్వారా వల
పెళ్లి పేరుతో మాట్రియోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసి యువతులను ఆకర్షించి లైంగిక దాడులకు పాల్పడిన మెకానికిల్ ఇంజనీర్ పోలీసులకు చిక్కాడు. మొత్తం 12 మంది యువతులను (Man Rapes 12 Women) వేధించిన మహేష్ అలియాస్ కరణ్ గుప్తాను నవీ ముంబై పోలీసులు అదుపులోకి (Arrested by Navi Mumbai Police) తీసుకున్నారు.
Mumbai. June 8: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి పేరుతో మాట్రియోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసి యువతులను ఆకర్షించి లైంగిక దాడులకు పాల్పడిన మెకానికిల్ ఇంజనీర్ పోలీసులకు చిక్కాడు. మొత్తం 12 మంది యువతులను (Man Rapes 12 Women) వేధించిన మహేష్ అలియాస్ కరణ్ గుప్తాను నవీ ముంబై పోలీసులు అదుపులోకి (Arrested by Navi Mumbai Police) తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన మహేష్ ఉన్నత విద్యావంతులైన యువతులను ఆకర్షించేందుకు మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్ లను సృష్టించాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా (Contacting Them on Matrimonial Sites) యువతులతో సన్నిహితంగా మెలుగుతూ వారిని ఫోన్లలో సంప్రదించి పబ్, రెస్టారెంట్లు,షాపింగ్ మాల్స్ లలో సమావేశం అయ్యేవాడు. మొదట వారితో చనువుగా ఉంటూ వారి ఫోన్ నెంబర్లను సంపాదించేవాడు. అనంతరం లైంగిక దాడులకు పాల్పడేవాడు.
ఈ సమావేశాల్లో యువతులను లైంగికంగా వేధించాడని డిప్యూటీ పోలీసు కమిషనర్ సురేష్ మెన్ గేడ్ చెప్పారు. డీసీపీ సురేష్ మెన్ గేడ్ మాట్లాడుతూ.. ప్రతీసారి నేరానికి పాల్పడే ముందు కొత్త మొబైల్ నంబరును ఉపయోగించేవాడు. ప్రతీసారి తన సిమ్‌ను మార్చుకుంటూ ఓలా లేదా ఉబెర్ ఉపయోగించి క్యాబ్‌లను బుక్ చేసేవాడు.
పైగా అతను ఉపయోగించే సిమ్‌లన్ని తన పేరిట ఉండకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. గతంలో హ్యాకర్ గా పనిచేసిన మహేష్ కంప్యూటర్లపై మంచి పరిజ్ఞానం ఉంది. కానీ మహేష్ దానిని తప్పడు మార్గంలో ఉపయోగిస్తున్నాడు.'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిందితుడు మహేష్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీసీపీ తెలిపారు.