Manipur Sexual Violence: మణిపూర్ ఘటన, నిందితుడి ఇల్లు తగలబెట్టిన గ్రామస్తులు, ఊరి నుంచి కుటుంబం వెలివేత, కేసులో ముగ్గురు అరెస్ట్

మణిపూర్ లో మహిళలపై సాగిన అమానుష కాండ యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి విదితమే.ఈశాన్య రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చేసి వారిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సభ్యసమాజం రగిలిపోతోంది.

House of man who allegedly paraded women naked set on fire

Imphal, July 21: మణిపూర్ లో మహిళలపై సాగిన అమానుష కాండ యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి విదితమే.ఈశాన్య రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చేసి వారిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సభ్యసమాజం రగిలిపోతోంది. కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అయినా ప్రజాగ్రహం మాత్రం చల్లారడం లేదు.

తాజాగా ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రకటించిన హుయిరేమ్ హెరోదాస్ సింగ్‌ ఇంటిని ఓ మూక తగలబెట్టేసింది. పేచీ అవాంగ్ లైకైలో ఉన్న హోరోదాస్‌ ఇంటిని చుట్టుముట్టిన కొందరు గ్రామస్తులు.. తాళం వేసిన ఆ ఇంటిని టైర్లతో కాల్చేశారు. ఆపై ఆ కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు ఆ ఊరిలో మోహరించాయి.

మీరు చర్యలు తీసుకుంటారా, మేము రంగంలోకి దిగాలా, మణిపూర్‌ ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, కేంద్రానికి అల్టిమేటం జారీ

ఈ దాడికి సంబంధించిన 26 సెకండ్ల నిడివి ఉన్న వీడియో బయటకు రావడంతో భయంతో కుటుంబాన్ని వేరే చోటకి తరలించి.. తాను మాత్రం మరో చోట తలచాచుకున్నాడు హుయిరేమ్‌. బుధవారం రాత్రి థౌబల్‌ జిల్లాను జల్లెడ పట్టిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అకృత్యానికి సంబంధించి మరో ముగ్గురినీ సైతం అరెస్ట్‌ చేసినట్లు గురువారం సాయంత్రం ప్రకటించారు.

మణిపూర్ ఘటనలో నిందితుడు ఇతడే, అరెస్ట్ చేసిన పోలీసులు, దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు

ఇక సోషల్‌ మీడియా నుంచి వీడియోలను తొలగించాలని కేంద్రం అన్ని ఫ్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మహిళా కమిషన్‌ సైతం స్పందించి ఆ వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ఈ ఘటనను హేయనీయమైన చర్యగా అభివర్ణించిన సుప్రీం కోర్టు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గనుక చర్యలు తీసుకోకుంటే తామే రంగంలోకి దిగుతామని స్పష్టం చేస్తూ.. వచ్చే శుక్రవారానికి(జులై 28కి) విచారణ వాయిదా వేసింది.