Manish Sisodia Arrested By CBI: లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్, 8 గంటల పాటూ విచారించిన సీబీఐ, సహకరించడం లేదని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన

ఈ ఉదయం నుంచి ఆయన్ను విచారించిన సీబీఐ (CBI) అధికారులు...అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సిసోడియాను రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఢిల్లీ పోలీసులు

Manish Sisodia. (Photo Credits: PTI)

New Delhi, FEB 26: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను (Manish Sisodia Arrest) అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ఈ ఉదయం నుంచి ఆయన్ను విచారించిన సీబీఐ (CBI) అధికారులు...అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సిసోడియాను రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఢిల్లీ పోలీసులు. సిసోడియా అరెస్ట్ (Manish Sisodia Arrested By CBI) నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించడంలో సిసోడియా కీలకంగా వ్యవహరించారు. దాంతో ఆయన్ను సుధీర్ఘంగా విచారించింది సీబీఐ. ఢిల్లీకి చెందిన ఓ బ్యూరోక్రాట్ ఇచ్చిన సమాచారం మేరకు సిసోడియాను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన విచారణకు సహకరించలేదని, అందుకే అరెస్ట్ చేసినట్లు అధికారులు చెప్తున్నారు.

అయితే సిసోడియా అరెస్ట్ పై ఉదయం నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లో ఆందోళనలు నిర్వహించారు. దాంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సిసోడియా అరెస్ట్ ను ఆప్ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు ఆప్ నేతలు.



సంబంధిత వార్తలు

US Elections Results 2024: ట్రంప్ 2.0 భారత్-అమెరికా సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుంది, వైట్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న ట్రంప్‌తో భారత్‌కు మేలు చేకూరేనా..?

US Elections Results 2024: అందుకే ఆ చావు నుంచి దేవుడు నన్ను కాపాడాడు, విజయాన్ని ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు, ఎన్ని కేసులు ఉన్నా ట్రంప్‌కే జై కొట్టిన అమెరికన్లు

US Elections Results 2024: అమెరికా కాంగ్రెస్‌కు తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌, డెలవేర్‌ రాష్ట్రం నుంచి భారీ ఓట్లతో విజయం సాధించిన సారా మెక్‌బ్రైడ్‌

US Elections Results 2024: అమెరికా అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించే కీలకమైన రెండు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయకేతనం, అమెరికా సెనెట్‌ని దక్కించుకున్న రిపబ్లికన్ పార్టీ, అగ్రరాజ్య పీఠానికి అడుగుదూరంలో డొనాల్డ్ ట్రంప్