'Go To Pakistan': వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోండి, మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు, ఎస్పీపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్, క్లారిటీ ఇచ్చిన మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్
ఈ వ్యాఖ్యలతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు.యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు(Anti-CAA Protests) జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Lucknow, December 28: మీరంతా వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోండంటూ (Go To Pakistan)ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎస్పీ (Meerut SP )అఖిలేష్ నారాయణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు.యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు(Anti-CAA Protests) జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)ఆందోళనల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ (Akhilesh Narayan Singh,Meerut SP) స్వయంగా రంగంలోకి దిగారు. వీధుల్లో కలియ తిరిగారు. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో ఆగిన ఎస్పీ.. అక్కడే ఉన్న కొందరు ముస్లిం యువకులను ఉద్దేశించి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అని ఎస్పీ వారిని ప్రశ్నించారు. మేము నమాజ్ చేసుకోవడానికి మసీదుకి వెళ్తున్నామని ఆ యువకులు ఎస్పీకి బదులిచ్చారు.
Here's ANITweet
అది.. సరే.. మరి మీ దుస్తులపై నలుపు, నీలం రంగు బ్యాడ్జులు ఎందుకు ఉన్నాయి అని ఎస్పీ ప్రశ్నించారు. ఈ వీధిని నేను చక్కదిద్దుతాను, మీరంతా పాకిస్తాన్ వెళ్లిపోండి అని అన్నారు. భారత దేశంలో ఉండాలని ఇష్టం లేకపోతే వెంటనే వెళ్లిపోండి అని ఎస్పీ అన్నారు. ఎక్కడెక్కడో వాళ్లంతా వచ్చి భారత దేశంలో ఉంటున్నారు అని సీరియస్ అయ్యారు. అంతటితో ఎస్పీ ఆగలేదు. ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్కరిని తీసుకెళ్లి జైల్లో పెడతాను అని వార్నింగ్ కూడా ఇచ్చారు. అందరి అంతు చూస్తాను అని సీరియస్ గా అన్నారు.
ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఎస్పీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎస్పీ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. యువకులు నిరసనలు చేస్తుంటే ఆ మాటలు అన్నానని తెలిపారు. మమ్మల్ని చూసిన కొందరు కుర్రాళ్ళు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసి పరిగెత్తడం ప్రారంభించారు. మీరు ఇలాంటి నినాదాలు చేసి భారత్‌ను ద్వేషిస్తే పాకిస్థాన్‌కు వెళ్లండి అని నేను వారికి చెప్పాను "అని మీరట్ ఎస్పీ అన్నారు. వారంతా 20 ఏళ్ళ వయసులో ఉన్నారని సామాజిక వ్యతిరేక అంశాలను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని యుపి పోలీసులు గుర్తించారని ఆయన అన్నారు.
Here's ANI Tweet
కాగా యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అరెస్ట్ అయ్యారు. హింసాత్మక ఘటనల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 19 మంది చనిపోగా, వెయ్యి మందికి పైగా అల్లర్ల కేసుల్లో అరెస్ట్ అయ్యారు.పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో 288 మంది పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లతో సంబంధం ఉందనే ఆరోపణలలతో 1,113 మందిని అరెస్ట్ చేశారు. 327 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 5,558 మందిని ముందస్తు అరెస్ట్‌లు చేశారు.