Megastar Chiranjeevi : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్, అరుదైన గౌరవం దక్కించుకున్న చిరంజీవి

గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ ఈ సర్టిఫికెట్‌ను చిరంజీవికి గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ సమక్షంలో అంద‌జేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్. డ్యాన్స్‌, డైలాగ్స్‌కు కేరాఫ్. ఆరు పదుల వయస్సులోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు చిరంజీవి.

Megastar Chiranjeevi Honored with Guinness World Record(X)

Hyd, Sep 22: అన్నయ్య, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ ఈ సర్టిఫికెట్‌ను చిరంజీవికి గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ సమక్షంలో అంద‌జేశారు.

మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్. డ్యాన్స్‌, డైలాగ్స్‌కు కేరాఫ్. ఆరు పదుల వయస్సులోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు చిరంజీవి. సినిమాలే కాదు సేవా కార్యక్రమాలతో అశేష అభిమానులను సంపాదించుకున్నారు. 156 మూవీల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు.పుష్ప 2 షూటింగ్‌ లో జానీ మాస్టర్‌ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో) 

Here's Tweet:

 ఈ ఏడాదే దేశ రెండో అత్యున్న‌త పౌర పుర‌స్కారం ప‌ద్మ విభూష‌ణ్‌ను చిరంజీవి అందుకున్నారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీలో న‌టిస్తున్నారు.

సోషియో ఫాంటసీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం.