Delhi Earthquake: ఢిల్లీలో స్వల్ప భూకంపం, భయంతో పరుగులు తీసిన ప్రజలు, హర్యానాలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తింపు
రిక్టర్ స్కేల్‌పై 2.7 తీవ్రతతో మధ్యాహ్నం 4.42 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. హర్యానాలోని జాజ్జర్‌కు 37 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. మధ్యాహ్నం ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో బయటకు పరుగులు పెట్టారు.
New Delhi, March 22: దేశ రాజధాని ఢిల్లీని భూకంపం (earthquake) మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 2.7 తీవ్రతతో మధ్యాహ్నం 4.42 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. హర్యానాలోని జాజ్జర్‌కు 37 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. మధ్యాహ్నం ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో బయటకు పరుగులు పెట్టారు. ఇప్పటి వరకు నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని, స్వల్ప ప్రకంపనలేనని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్ (west Delhi) పరిధిలో దాదాపు రెండు నిమిషాల పాటు భూమి కంపించిన విషయం తెలిసిందే.
Covid in India: పెరుగుతున్న కరోనా కేసులు, కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
రిక్టర్ స్కేల్‌పై 6.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని హిందుకుష్ పర్వత శ్రేణులు గుర్తించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరభారతంలో ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ (Delhi), హర్యానా, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోనూ ప్రభావం కనిపించింది. దాదాపు రెండు నిమిషాల పాటు భూమి కంపించడంతో ఇండ్లు, భవనాలు ఊగిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన జనం ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. ఇందకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.