AP Minister Savita: ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కడప ఎస్పీకి ఆదేశం..విషమంగా బాధితురాలి ఆరోగ్యం
ఎస్పీ విద్యాసాగర్ తో ఫోన్ లో మాట్లాడిన సవిత...నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్య సేవలందించాలని రుమా ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.
Kadapa, Dec 8: కడప జిల్ఆలో జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్ అయ్యారు. ఎస్పీ విద్యాసాగర్ తో ఫోన్ లో మాట్లాడిన సవిత...నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్య సేవలందించాలని రుమా ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ షర్మిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యుల వెల్లడించారు. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్, భార్య ఎదుటే ఆమె ప్రియుడికి దేహశుద్ది..వైరల్‌గా మారిన వీడియో
Here's Tweet:
కడప జిల్లా వేముల కొత్తపల్లి గ్రామంలో షర్మిల అనే యువతిపై కత్తితో దాడి చేశాడు కుళ్లాయప్ప అనే యువకుడు. పరిస్థితి విషమించడంతో యువతిని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. బాధితురాలి శరీరంపై 11 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. యువకుడు మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కొంతకాలంగా యువతిని ప్రేమించమని వేధించేవాడని.. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది.