Monkey Fever in Karnataka: కర్ణాటకను వణికిస్తున్న మంకీ ఫీవర్‌, ఇద్దరు మృతి, తాజాగా 47 కొత్త కేసులు, కోతులను కరిచే కీటకాలు మనిషిని కరవడం వల్ల వ్యాధి

దీంతో, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Representative Image

Bengaluru, Feb 5: కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో (Monkey Fever in Karnataka) ఇద్దరు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంకీ ఫీవర్‌తో కర్ణాటకలో ఇద్దరు మరణించారు. శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన యువతి (18), ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఒక వృద్ధుడు (79) చికిత్స పొందుతూ మృతిచెందారు. జనవరి 8న సదరు యువతి చెందింది. ఇక, ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ రణ్‌దీప్‌ వెల్లడించారు. ఈ క్రమంలో శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఓరి దేవుడా..మళ్లీ కోతి జ్వరం వచ్చింది, హడలిపోతున్న కర్ణాటక వాసులు, రోజు రొజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య, మరణించిన కోతుల ద్వారా వైరస్ వ్యాప్తి, కోతి జ్వరం లక్షణాలు తెలుసుకోండి

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో గత 15 రోజుల్లో 31 కోతుల జ్వరం కేసులు నమోదయ్యాయని ఆరోగ్య అధికారులు శుక్రవారం తెలిపారు.సోకిన వారిలో 12 మంది రోగులు ఆసుపత్రుల్లో చేరగా, మిగిలిన వారు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. వీరంతా నిలకడగా ఉన్నారని, ఇప్పటివరకు ఎలాంటి సీరియస్ కేసు నమోదు కాలేదని వారు తెలిపారు. సిద్దాపూర్ తాలూకాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 49 మందికి మంకీ ఫీవర్‌ ఉన్నట్లు (2 Deaths and 49 Cases of Kyasanur Forest) గుర్తించామన్నారు.

కోతుల జ్వరం అని కూడా పిలువబడే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (కెఎఫ్‌డి) మొదటి కేసు జనవరి 16 న నమోదైందని అధికారులు తెలిపారు. అధికారుల ప్రకారం, సాధారణంగా కోతులపై జీవించే పేలు కాటు కారణంగా కోతుల జ్వరం వ్యాపిస్తుంది. ఈ టిక్ మనుషులను కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. పేలు కాటుకు గురైన పశువులతో మనుషులు కూడా ఈ వ్యాధి బారిన పడతారు.

డేంజర్ జోన్‌లో కోనసీమ, కరోనాను తలదన్నేమరో కొత్త వైరస్

తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అటవీ పరిసర ప్రాంతాలలో నివసించే వారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున మరింత జాగ్రత్తగా ఉండాలని వారు తెలిపారు. ఉత్తర కన్నడ జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ నీరజ్ బి మాట్లాడుతూ: "ఒకసారి మీరు కోతి జ్వరం బారిన పడినట్లయితే, రాబోయే మూడు నుండి ఐదు రోజులలో మీకు తీవ్రమైన జ్వరం, తీవ్రమైన శరీర నొప్పి, తలనొప్పి, కళ్ళు ఎర్రబడటం, జలుబు మరియు దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి" అని అన్నారు.

కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందన్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపిస్తాయని చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్‌ వేయించేందుకు ఐసీఎంఆర్‌ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.