Monkey Pox in India: దేశంలో రెండో మంకీ పాక్స్ కేసు, శరీరంలో ఈ లక్షణాలు ఉంటే మంకీ పాక్స్ వ్యాధి వచ్చినట్లే, మంకీపాక్స్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఓ సారి చూద్దాం

చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు (Second Confirmed Case of MPV) నమోదైంది. దుబాయ్‌ నుంచి వచ్చిన 31 వ్యక్తికి మంకీపాక్స్‌ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ సోమవారం వెల్లడించారు. అతనితో సన్నిహితంగా ఉన్న వారి నమూనాలను కూడా పరీక్షలకు పంపినట్లు పేర్కొన్నారు.

Monkeypox (Pic Credit: Twitter)

Kannur, July 18: దేశంలో మంకీ పాక్స్‌ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు (Second Confirmed Case of MPV) నమోదైంది. దుబాయ్‌ నుంచి వచ్చిన 31 వ్యక్తికి మంకీపాక్స్‌ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ సోమవారం వెల్లడించారు. అతనితో సన్నిహితంగా ఉన్న వారి నమూనాలను కూడా పరీక్షలకు పంపినట్లు పేర్కొన్నారు. కాగా భారత్‌లో మంకీపాక్స్‌ తొలికేసు కూడా కేరళలోనే (Kerala's Kannur District) నమోదైన విషయం తెలిసిందే. దేశంలో మంకీపాక్స్‌ వెలుగుచూసిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ కట్టడికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది.

మరోవైపు రాష్ట్రంలో వైరస్‌ (Monkey Pox in India) వ్యాప్తి చెందకుండా.. రాష్ట్రంలోని అయిదు జిల్లాలకు (తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్టా, అలప్పుజా, కొట్టాయం) ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తి ప్రయాణించిన విమానంలో చాలామంది ప్రయాణికులు ఈ ప్రాంతానికి చెందినవారే. ఆ ప్రయాణికులందరూ అప్రమత్తంగా ఉండాలని, కనీస లక్షణాలు కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కేరళలో రెండో మంకీ పాక్స్ కేసు నమోదు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్

యూరప్‌ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మంకీపాక్స్‌ భారత్‌లోనూ అలజడి సృష్టిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశంలో చాపకింద నీరులా ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఈ మంకీపాక్స్‌ వైరస్‌ భారత్‌ సహా 50 దేశాలకు విస్తరించింది. ఈ వ్యాధి కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా.. జంతువుల నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

మంకీపాక్స్ అంటే ఏమిటి?

మంకీపాక్స్ అనేది జూనోటిక్ వ్యాధి. ఎలుకలు, ప్రైమేట్స్ వంటి అడవి జంతువుల నుండి ఎక్కువగా ప్రజలకు వ్యాపిస్తుంది. ఇది మానవుని నుండి మానవునికి సంక్రమించే అవకాశం కూడా ఉంది. అనేక దేశాల్లో ఈ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇది అరుదైన వ్యాధి, మశూచికి దారితీసే వైరస్ వంటి ఇతర పాక్స్ వైరస్ల మాదిరిగానే ఉంటుంది. మంకీపాక్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సోకే అవకాశం ఉంది. ఏదైనా గాయం, శారీరక సంపర్కం వల్ల కూడా ఇది వ్యాపిస్తుందట. ముఖ్యంగా మనషులకు అయితే.. ఒకరి నుంచి మరొకరికి కేవలం లైంగిక సంపర్కం వల్ల వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి మంకీపాక్స్‌కు గురైనప్పుడు, అది వెంటనే లక్షణాలను చూపించదు. వైరస్ కోసం పొదిగే కాలం ఏడు నుండి 21 రోజుల మధ్య ఉంటుంది.

మంకీపాక్స్ ఎలా సోకుతుంది

మంకీపాక్స్ సోకిన జంతువు కరవడం, రక్తం, శరీర ద్రవాలు, జంతువుల యొక్క జుట్టును తాకడం ద్వారా ఈ వ్యాధి మనుషులకు సోకవచ్చు. ఇది ఎలుకలు, ఉడుతలు వంటి వాటి ద్వారాకూడా మనుషులకు వ్యాపిస్తుందని వైద్యులు తెలిపారు. దీనికితోడు వ్యాధి సోకిన జంతువు నుండి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం ద్వారా కూడా ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశం ఉంది. దద్దుర్లు ఉన్నవారు ఉపయోగించే దుస్తులు,పరుపు, తువ్వాలను తాకడం ద్వారా మరొకరికి సోకుతుంది. మంకీపాక్స్ వ్యాధి సోకిన వారు చనిపోయే అవకాశాలు తక్కువే. చిన్నిపిల్లలు, వృద్ధుల్లో ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది.

మంకీపాక్స్ సంకేతాలు, లక్షణాలు

ఒక వ్యక్తి మంకీపాక్స్‌కు గురైనప్పుడు, అది వెంటనే లక్షణాలను చూపించదు. వైరస్ కోసం పొదిగే కాలం ఏడు నుండి 21 రోజుల మధ్య ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించిన తర్వాత, వ్యాధి ముఖం మీద దద్దుర్లు రావడం మొదలౌతాయి. ఇది మొత్తం శరీరానికి కూడా వ్యాపిస్తుంది. అవి మొదట రంగు మారిన ప్రాంతాలుగా కనిపిస్తాయి, తరువాత అవి ద్రవంతో నిండిన బొబ్బలుగా, చీముతో నిండిన పొక్కులుగా, పుండ్లు గా మారి మచ్చలుగా మారతాయి.

చికెన్ పాక్స్ ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి. ఒంటి మీద ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు వస్తాయి. జ్వరం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, చలి వంటి సంకేతాలు కనిపిస్తాయి. కొద్ది రోజుల తర్వాత శరీరంపై ఎర్రటి దద్దుర్లు వచ్చి చీము పడతాయి. ఈ ప్రక్రియ అంతా జరిగేందుకు రెండు నుంచి నాలుగు వారాల పాటు జరుగుతుంది.ఈ వ్యాధి సోకిన వారిలో చాలామంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది.

నివారణ చికిత్స

మంకీపాక్స్‌కు ధృవీకరించబడిన చికిత్స లేనప్పటికీ, కొంతమంది వైద్యులు అనారోగ్యాన్ని నియంత్రించడానికి యాంటీవైరల్ మందులను కూడా ఇవ్వవచ్చు. కొన్ని యాంటీవైరల్ చికిత్సలు తక్కువ దుష్ప్రభావాలతో పని చేస్తున్నాయి. ఇంకా, మశూచి వ్యాక్సిన్ అనారోగ్యం చికిత్సలో 85% ప్రభావవంతంగా ఉంటుంది. యుఎస్ జిన్నెయోస్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోంది, ఇది మశూచి, మంకీపాక్స్ వ్యాక్సిన్ (లైవ్, నాన్‌రెప్లికేటింగ్). టీకా రెండు మోతాదులలో ఇస్తారు. కరోనా సమయంలో మనం అనుసరించిన జాగ్రత్తల మాదిరిగానే.. సామాజిక దూరం, మాస్కింగ్, మెరుగైన వెంటిలేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండాలి. వాళ్ళు ఉపయోగించిన దుస్తులు వేసుకోవడం, వైరస్ సోకి చనిపోయిన జంతువులని పట్టుకోవడం వంటివి చేయకూడదు. వైరస్ సోకిన వ్యక్తులు శరీరమంతా కప్పి ఉంచే విధంగా ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి. బాగా ఉడికించిన మాంసం, కూరగాయలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. బయటకి వెళ్ళిన సమయంలో ముక్కు, నోరు కవర్ చేసే విధంగా మాస్క్ ధరించి ఉండటం మంచిది. మంకీ పాక్స్ సోకిన వ్యక్తులు ఉన్న ప్రదేశాన్ని క్రిమి సంహరక మందులు వేసి శుభ్రం చేసుకోవాలి. వాళ్ళ దగ్గరకి వెళ్లేటప్పుడు పీపీఈ కిట్ ధరించి వెళ్ళడం ఉత్తమం అని ప్రముఖ వైద్యులు కుమార్ సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా కూడా దీన్నుంచి బయట పడొచ్చు.

* దద్దుర్లు ఎప్పుడూ తేమ లేకుండా పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఆ ప్రాంతాన్ని రక్షించడానికి దుస్తులు నిండుగా వేసుకోవాలి.

* నోటిలో లేదా కళ్ళల్లో బొబ్బలు వస్తే వాటిని తాకకూడదు.

* బాగా విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా ద్రవాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. జ్వరం నుంచి ఉపశమనం పొందేందుకు పారాసెటమాల్ వేసుకోవాలి.

* చర్మం మీద ఎర్రపడిన గాయాలకు యాంటీ సెప్టిక్ క్రీములు ఉపయోగించవచ్చు.

* శరీరం డీహైడ్రేట్ అవకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలి.

* ఓ ఆర్ ఎస్ వంటి వాటిని తీసుకోవాలి.

* పౌష్టికాహారం తీసుకోవాలి.

కనిపించే సాధారణ లక్షణాలు:

జ్వరం

తలనొప్పి

కండరాల నొప్పి

వెన్నునొప్పి

చలి

అలసట



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif