Southwest Monsoon Arrives: గుడ్ న్యూస్! కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మూడు రోజుల ముందుగానే భారత్‌లోకి ప్రవేశం, ఈసారి సాధారణ వర్షాపాతమే నమోదవ్వచ్చొంటున్న ఐఎండీ

షెడ్యూల్‌ కంటే మూడు రోజులకు ముందుగానే నైరుతి కేరళలో ప్రవేశించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ప్రతి యేటా జూన్ 1కి నైరుతి రుతుపనాలు కేరళకు చేరుకుంటాయి. అయితే ఈసారి మాత్రం నైరుతి కేరళను మూడు రోజుల ముందే పలకరించింది.

Rains (Photo Credits: PTI)

Kerala, May 29: ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ఎట్టకేలకు కేరళను (Kerala) తాకాయి. షెడ్యూల్‌ కంటే మూడు రోజులకు ముందుగానే నైరుతి కేరళలో ప్రవేశించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ప్రతి యేటా జూన్ 1కి నైరుతి రుతుపనాలు కేరళకు చేరుకుంటాయి. అయితే ఈసారి మాత్రం నైరుతి కేరళను మూడు రోజుల ముందే పలకరించింది. మే 20 వరకు మందకోడిగా కదలిన మాన్‌సూన్ ఆ తర్వాత వేగంగా విస్తరించడం మొదలు పెట్టాయి. నైరుతి ప్రభావంతో ఇప్పటికే కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు… తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తన్నాయి.

Fake Currency: కరెన్సీ తీసుకునేటప్పుడు బీ అలర్ట్, 101 శాతం పెరిగిన నకిలీ కరెన్సీ చలామణి, భారీగా మార్కెట్లో నకిలీ రూ.500 నోట్లు ఉన్నాయంటూ ఆర్బీఐ ప్రకటన 

నైరుతి రాకతో భానుడి భగభగల నుంచి రిలీఫ్ లభించనుంది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం (IMD) వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో కేర‌ళ‌లోకి నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని గతంలో వెల్లడించింది. కాగా, సాధారణం కంటే చాలా ముందుగానే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకాయని మృత్యుంజయ్‌ తెలిపారు. భారతీయ వ్యవసాయ ఆధారిత ఆర్థిక రంగానికి నైరుతి రుతుపవనాలు ప్రధాన ఆధారంగా నిలుస్తాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif