Mumbai: ముంబైలో భారీ అగ్నిప్రమాదం, గోదాంలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, కాలిబూడిదైన 14 వాహనాలు, పటాకులు పేల్చడం వల్లే మంటలు అంటుకున్నాయని అనుమానాలు

రాజధానిలోని గుర్‌గావ్‌ ప్రాంతంలో ఉన్న ఓ గోదాంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 14 వాహనాలు కాలిబూడిదయ్యాయి.

Fire (Representational image) Photo Credits: Flickr)

Mumbai, Oct 27: మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజధానిలోని గుర్‌గావ్‌ ప్రాంతంలో ఉన్న ఓ గోదాంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 14 వాహనాలు కాలిబూడిదయ్యాయి. ఇందులో ఆరు కార్లు, ఏడు బైకులు, ఓ స్కూటర్‌, ఆటో ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అయితే రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఫైర్‌ఇంజిన్లు రావడానికి ఆలస్య మయిందని స్థానికులు తెలిపారు.

సికింద్రాబాద్‌లో పెద్ద శబ్దంతో పేలిన గ్యాస్ సిలిండర్, ఒకరు మృతి, తొమ్మిది మందికి గాయాలు, పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం

దీంతో వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ వారి శ్రమ వృధా అయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పటాకులు పేల్చడం వల్లే మంటలు అంటుకున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.