Maharashtra DGIPR: ఉగ్ర దాడుల అలర్ట్, ముంబైలో మినీ విమానాలు, డ్రోన్లపై నిషేధం, మార్చి 24వతేదీ వరకు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముంబై పోలీస్ డీసీపీ
ఏ క్షణమైనా ఉగ్రవాదులు వైమానిక దాడులకు (Aerial Attack) పాల్పడవచ్చని అందిన సమాచారం మేరకు ముంబై పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సముద్ర తీరంలోని ముంబై నగర గగనతలంలో చిన్న విమానాలు, డ్రోన్లను నిషేధిస్తూ పోలీసులు (Maha DGIPR) ఉత్తర్వులు జారీ చేశారు.
Mumbai, Febuary 29: దేశ ఆర్థిక రాజధాని ముంబై పోలీసులు (Mumbai Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ క్షణమైనా ఉగ్రవాదులు వైమానిక దాడులకు (Aerial Attack) పాల్పడవచ్చని అందిన సమాచారం మేరకు ముంబై పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సముద్ర తీరంలోని ముంబై నగర గగనతలంలో చిన్న విమానాలు, డ్రోన్లను నిషేధిస్తూ పోలీసులు (Maha DGIPR) ఉత్తర్వులు జారీ చేశారు.
మార్చి 24వతేదీ వరకు ముంబై గగనతలంలో చిన్న విమానాలు, డ్రోన్లను నిషేధించామని సమాచార ప్రజా సంబంధాల విభాగం డైరెక్టర్ జనరల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముంబై నగరంలో ఉగ్రవాదులు ఎలాంటి వాయు మార్గాల్లో దాడులు చేయకుండా నివారించేందుకు తాము మార్చి 24వతేదీ వరకు నిషేధ జోన్ గా (prohibited Zone) ప్రకటించామని సమాచార ప్రజా సంబంధాల విభాగం డైరెక్టర్ జనరల్ ట్వీట్ చేశారు.
ముంబై గగనతలంలో పారాగ్లైడర్స్, బెలూన్లు, క్రాకర్స్, పతంగులు, లేజర్ లైట్లు కూడా వినియోగించకుండా నిషేధించారు. ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Chhatrapati Shivaji Maharaj International Airport) ఏప్రిల్ 18 వరకు నిషేధించబడ్డాయని ముంబై పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఉత్తర్వులను ముంబై డీసీపీ ఆపరేషన్స్ పోలీస్ విభాగం జారీ చేసింది.
Here's Maharashtra DGIPR Tweet
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా సీఏఏపై అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఆందోళనలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ అల్లర్లతో అట్టుకుడుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఏ క్షణమైనా దాడి చేయవచ్చని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయని సమాచారం.